AP Auto Drivers Sevalo Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ సంక్షేమం కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఆటో డ్రైవర్స్ సేవలో పథకాన్ని అక్టోబర్ 4వ తేదీన అధికారికంగా ప్రారంభించనున్నారు. అక్టోబర్ 4 సాయంత్రం 4:00 గంటలకు లబ్ధిదారుల ఎకౌంట్లో ₹15,000/- రూపాయలు జమకానున్నాయి. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని ఆటో, టాక్సీ, క్యాబ్, లారీ, మ్యాక్సీ క్యాబ్, మరియు మోటార్ కార్ డ్రైవర్లు లబ్ధి పొందనున్నారు. అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించబోయే ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ఈ క్రింది సమాచారం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోగలరు.
ఆటో డ్రైవర్స్ సేవలో పథకం ముఖ్యమైన తేదీలు :
- ఆటో డ్రైవర్స్ సేవలో పథకం ప్రారంభ తేదీ : అక్టోబర్ 4, 2025
- మొత్తం లబ్ధిదారుల సంఖ్య : 2,90,234 మంది ఆటో డ్రైవర్స్
- సహాయం చేకూరే మొత్తం ధనం విలువ : ₹15,000/-
- ఈ పథకం అమలు చేయడానికి అయ్యే మొత్తం ఖర్చు: ₹435.35 కోట్లు
ఈ పథకానికి ఎవరు అర్హులు?:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడుతున్న ‘ ఆటో డ్రైవర్స్ సేవలో ‘ పథకానికి అర్హుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- ఈ పథకానికి రాష్ట్రంలో నివసించే ఆటో డ్రైవర్లు మాత్రమే అర్హులు
- టాక్సీ మరియు క్యాబ్ డ్రైవర్లు కూడా అర్హులే.
- లారీ, మ్యాక్సీ క్యాప్, మోటార్ కార్ డ్రైవర్లు అర్హులు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా విభాగం ద్వారా నమోదైన డ్రైవర్లు అర్హులు.
పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం:
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు మరియు ఇతర డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించడం.
- వాహన ఖర్చులు, ఇన్సూరెన్స్ మరియు కుటుంబ అవసరాలకు మద్దతు ఇవ్వడం.
- పేద మరియు మధ్యతరగతి డ్రైవర్లకు ఆదాయ వనరుల్లో ఉపశమనం కల్పించడం.
లబ్ధిదారుల జాబితా ఎలా చెక్ చేసుకోవాలి?:
ఆటో డ్రైవర్ సేవలో పథకానికి అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఈ క్రింది విధంగా చెక్ చేసుకోగలరు.
- అన్ని అర్హతలు కలిగిన ఆటో డ్రైవర్లు, ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను పొందుపరిచారు.
- అర్హులైన వారు మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
- మీకు ఈ పథకానికి అర్హత ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వ అధికారిక పోర్టల్ ను దర్శించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది డ్రైవర్లకు ఉపశమనం కల్పించనుంది. అక్టోబర్ 4వ తేదీ నుండి ఆటో డ్రైవర్స్ ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ కానుండడంతో వారికి గొప్ప ఆర్థిక సహాయం అందనుంది.