SBI PO Prelims 2025:
కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైనటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆగస్టు 4 మరియు 5వ తేదీన నిర్వహించిన ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఫలితాలు కోసం అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఫలితాలను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. మొత్తం 541 ప్రొఫెషనరీ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈ పరీక్షలను నిర్వహించారు. ప్రిలిమిరి రాత పరీక్షల అర్హత పొందినటువంటి వారికి మెయిన్స్ పరీక్షలను నిర్వహించి ఆ తర్వాత ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొఫెషనరీ ఆఫీసర్ పోస్ట్లు యొక్క ప్రిలిమినరీ పరీక్షల ఫలితాల వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
SBI PO 2025 Prelims Results Date:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొఫెషనల్ ఆఫీసర్ 2025 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విడుదలకు సంబంధించి అధికారిక తేదీ వెలువడనప్పటికీ, ఈ ఫలితాలను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నటువంటి అభ్యర్థులు SBI అధికారిక వెబ్సైట్ లో తాజా అప్డేట్స్ కోసం తరచూ సందర్శిస్తూ ఉండాలని అధికారులు సూచించారు. లేదా ఫలితాలు సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు విజిట్ చేయండి.
How to check prelims results :
SBI PO ప్రిలిమ్స్ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని అనుసరించండి.
- ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి
- వెబ్సైట్ హోం పేజ్ లో ” SBI PO 2025 prelims results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన ప్రిలిమ్స్ ఫలితాల స్కోర్ కార్డు డౌన్లోడ్ అవుతుంది.
- మీరు ఆ పరీక్షలో అర్హత పొందాల లేదో చెక్ చేసుకొని స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి.
SBI PO 2025 results official website
FAQ’s:
1.SBI PO 2025 mains పరీక్ష తేదీలు ఎప్పుడు?
సెప్టెంబర్ 2025 లోనే మెయిన్స్ పరీక్షల నిర్వహించనున్నారు
2. ఇంటర్వ్యూలు ఎప్పుడు నిర్వహిస్తారు?
మైన్స్ పరీక్షలో అర్హత పొందిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు రాబోయే రోజుల్లో వెల్లడిస్తారు.