AP DSC 2025 Final Key & Results Date : Check Details

AP DSC 2025 Results Date:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జూన్ ఆరో తేదీ నుండి జూలై రెండో తేదీ వరకు నిర్వహించిన ఏపీ మెగా డీఎస్సీ పరీక్ష ఫలితాలను మరియు ఫైనల్ కీ ని ఈరోజు విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం 16 వేలకు పైగా ఉన్నటువంటి టీచర్ పోస్టులకు సంబంధించి 3,60,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. జూలై మొదటి వారంలో ప్రాథమిక కీ విడుదల చేసి, జూలై 12వ తేదీ వరకు అధ్యక్షుని పెట్టుకోవడానికి ప్రభుత్వం అభ్యర్థులకు అవకాశం కల్పించింది. పెట్టుకున్న వారం రోజుల తర్వాత ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా, ఇప్పుడు ఆ ఫైనల్ కీ ఫలితాలు కొంత ఆలస్యం అయ్యాయి. అయితే విద్యాశాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం ఈరోజు ఫైనల్ కీ ఫలితంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఏపీ డీఎస్సీ ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

AP DSC 2025 Final Key Release Date:

ఆంధ్రప్రదేశ్ మెగా DSC 2025 ఫైనల్ కీ ఫలితాలను జూలై 29వ తేదీ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తో అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి, మీరు రాసిన పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీ ని చెక్ చేసుకోవచ్చు.

Join WhatsApp group

డీఎస్సీ పరీక్ష ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:

ఏపీ డీఎస్సీ 2025 పరీక్ష ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి

  1. ముందుగా ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి.
  2. వెబ్సైట్ హోంపేజీలో ” AP DSC 2025 Final Key Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. అభ్యర్థుల పూర్తి వివరాలుతో లాగిన్ అవ్వండి .
  4. హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
  5. స్క్రీన్ పైన అభ్యర్థుల యొక్క ఫైనల్ కీ డౌన్లోడ్ అవుతుంది.
  6. మీకు వచ్చిన మార్కులు ఎన్నో చెక్ చేసుకోండి.

AP DSC 2025 Final Key Results

FAQ’s:

1. ఏపీ మెగాడీఎస్సి 2025 ఫైనల్ కీ ఫలితాలు ఎప్పుడు విడుదల చేయనున్నారు?

జూలై 29 2025వ తేదీన ఫైనల్ కీ ఫలితాలు విడుదల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

2. ఏపీ మెగా డీఎస్సీ 2025 మొత్తం పోస్టులు ఎన్ని?

16,400+ పైగా టీచర్ పోస్టులు భర్తీ చేయమన్నారు