AP EAMCET 2025:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 మొదటి విడత కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ ఫలితాలను జూలై 22వ తేదీన విడుదల చేయనున్నారు. మొదటి దశ కౌన్సిలింగ్ ప్రారంభించిన అధికారులు, వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న విద్యార్థులు వారికి ఏ కాలేజీలో సీటు వచ్చింది, ఏ బ్రాంచ్ లో సీట్లు లభించిందో తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో జూలై 22వ తేదీన లాగిన్ అయ్యి వారి యొక్క సీట్ అలాట్మెంట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు కోరుకున్న కాలేజీలో సీటు లభించిన వారు సంబంధిత కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫీజు చెల్లించవలెను. రెండవ దశ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ మరి కొద్ది రోజుల్లో ఏపీ ఎంసెట్ ఉన్నత విద్యా మండలి వారు విడుదల చేయనున్నారు.
సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల చేసే తేదీ?:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 మొదటి విడత కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ ఫలితాలను జూలై 22, 2025 ఉదయం 11 గంటలకు విడుదలచేయమన్నారు. సీట్ అలాట్మెంట్, కాలేజీలో సల్ఫర్ రిపోర్టింగ్ మరియు ఫీజు చెల్లించే తేదీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
| సీట్ అలాట్మెంట్ ఫలితాలు | జూలై 22, 2025 |
| సెల్ఫ్ రిపోర్టింగ్ & ఫీజు చెల్లించే తేదీ | జూలై 23 నుండి 26, 2025 వరకు |
| క్లాసెస్ ప్రారంభమయ్యే తేదీ | ఆగష్టు 04, 2025 |
సీట్ అలాట్మెంట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:
ఏపీ ఎంసెట్ 2025 మొదటి విడత కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా ఏపీ ఎంసెట్ 2025 అధికారిక వెబ్సైట్ ని సందర్శించండి.
- వెబ్సైట్ హోం పేజ్ లో ” AP EAMCET 2025 seat allotment results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క లాగ్ ఇన్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- విద్యార్థి యొక్క డాష్ బోర్డులో సీట్ అలాట్మెంట్ ఫలితాలకు సంబంధించిన లింక్ ఉంటుంది. దాని పైన క్లిక్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన సీట్ అలాట్మెంట్ ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
- నీకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో చెక్ చేసుకొని, అది ప్రింట్ అవుట్ తీసుకోండి.
AP EAMCET 2025 : Seat Allotment Results
FAQ’s:
1. ఏపీ ఎంసెట్ 2025 రెండవ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారు?
జవాబు: రెండో విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ నోటీసు ఈనెలాకరకు విడుదల చేయడం జరుగుతుంది.
2. మొదటి విడత కౌన్సిలింగ్ లో సీటు పొందిన విద్యార్థుల యొక్క క్లాసెస్ ఎప్పుడు ప్రారంభమవుతాయి?
జవాబు: ఆగస్టు 4, 2025 నుండి మొదటి సంవత్సర బీటెక్ క్లాసెస్ ప్రారంభమవుతాయి.
3. సీట్ అలాట్మెంట్ ఫలితాలను చెక్ చేసుకునేందుకు అధికారిక వెబ్సైట్ ఏమిటి?.
eapcet-sche.aptonline.in వెబ్సైట్లో చెక్ చేసుకోగలరు.
