TG BC Study Circle free coaching for groups exams:
తెలంగాణలోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్, SSC,బ్యాంకింగ్, రైల్వే, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం 150 రోజులపాటు ఉచితంగా శిక్షణ అందించడానికి నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు జూలై 16వ తేదీ నుండి ఆగస్టు 11వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోని అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు గడువు లాగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ అధికారులు తెలియజేశారు. ఈ ట్రైనింగ్ వచ్చే నెల 25వ తేదీ నుండి రాష్ట్రంలోని మొత్తం 12 స్టడీ సర్కిల్స్ లో ఈ శిక్షణ ఇస్తారు.
ఉచిత శిక్షణ ముఖ్యమైన వివరాలు:
- తెలంగాణలోని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, బ్యాంకింగ్, SSC రైల్వే, పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఈ ఉచిత శిక్షణ ఇవ్వన్నారు.
- ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹1000 కూడా చెల్లిస్తారు
- ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాదులో ఉచిత వసతి, భోజనం, శిక్షణ మరియు స్టడీ మెటీరియల్ అందజేస్తారు.
- ఉచిత శిక్షణ ప్రారంభమయ్యే తేదీ : ఆగస్టు 25, 2025
అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఉచిత స్టడీ మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకోండి
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం:
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లోకి (https://tgbcstudycircle.cgg.gov.in/) వెళ్లండి.
- ఉచిత కోచింగ్ కి ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే లింకు పైన క్లిక్ చేయండి
- అభ్యర్థుల యొక్క పూర్తి వివరాలను నమోదు చేసి, విద్యార్థుల యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
- చివరగా పూర్తి వివరాలు చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి.
TG BC Study circle : Free Coaching Apply Link
ఎంపిక చేసే విధానం:
- అభ్యర్థులు కచ్చితంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారై ఉండాలి
- గ్రామీణ ప్రాంతాల్లో ₹1.5లక్షలు, పట్టణ ప్రాంతాల్లో ₹2లక్షలలోపు ఆదాయం కలిగి ఉండాలి.
- డిగ్రీలో అత్యధిక శాతం మార్కులు,రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరిస్తూ ఎంపిక చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
ఉచిత శిక్షణలో ఉండే ప్రత్యేకతలు:
- తెలంగాణలో నిర్వహించే గ్రూప్స్ పరీక్షలతో పాటు రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్స్ కి నిర్వహించే పోటీ పరీక్షలకు ప్రిపరేషన్
- డైలీ క్లాసులు, టెస్టులు, ప్రాక్టీస్ పేపర్స్ పెడతారు
- ప్రభుత్వ ఆధ్వర్యంలో నాణ్యమైన శిక్షణ ఉంటుంది
- ఉచిత వసతి, భోజనం, మెటీరియల్స్ ఇస్తారు.
తెలంగాణలోని మొత్తం 12 బీసీ స్టడీ సర్కిల్స్ సెంటర్స్ లో ఈ ఉచిత శిక్షణ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మరియు పట్టణ ప్రాంతాలకు చెందిన నిరుపేద నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.