NMMS Scholarships 2025:
నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (National Means Cum Merit Scholarship) స్కీమ్ కి సంబంధించిన తాజా నోటిఫికేషన్ జూన్ 2, 2025 అధికారికంగా విడుదల చేశారు. 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ స్కాలర్షిప్స్ కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ స్కాలర్షిప్ పరీక్ష రాసి,ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం వరకు అనగా (12వ తరగతి) వరకు సంవత్సరానికి ₹12,000 రూపాయలు స్కాలర్షిప్స్ విద్యార్థి యొక్క అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. అయితే ఈ స్కాలర్షిప్స్ కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, రాత పరీక్ష ఎలా ఉంటుందనేటువంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
అంశము | తేదీలు |
NMMS నోటిఫికేషన్ విడుదల తేదీ | జూన్ 2, 2025 |
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ | జూన్ 2, 2025 |
దరఖాస్తు ప్రక్రియ ఆఖరి తేదీ | ఆగస్టు 31, 2025 |
లోపాలు సరి చేసే సమయం | సెప్టెంబర్ 15, 2025 |
విద్యార్థి యొక్క అర్హత ధ్రువీకరణ చేసే తేదీ | సెప్టెంబర్ 30, 2025 |
స్కాలర్షిప్ లక్ష్యాలు మరియు అమలుచేసే విధానం:
- ప్రధాన ఉద్దేశం: పాఠశాలలో 8వ తరగతి తర్వాత విద్యార్థులు తమ యొక్క విద్యను కొనసాగించేందుకుగాను, వారికి ఆర్థిక సహాయం అందించడానికి ఈ స్కాలర్షిప్స్ ని ప్రారంభించారు.
- కుటుంబం యొక్క వార్షిక ఆదాయం మూడు లక్షల 50 వేలు లేదా అంతకంటే తక్కువ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్షిప్ కి అర్హులు.
- ప్రభుత్వం / సహకారం పొందే పాఠశాలల్లో చదువుతున్నటువంటి 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను క్లాస్ డ్రాప్ అవుట్ కాకుండా చేసేందుకు ఈ పథకాన్ని రూపొందించారు.
- 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు సంవత్సరానికి ₹12,000/- స్కాలర్షిప్ విద్యార్థి యొక్క బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తారు.
తెలంగాణ పాలిసెట్ 2025 సీట్ అలాట్మెంట్ ఆలస్యానికి గల కారణాలు
అర్హతలు:
- 7వ తరగతిలో 55 శాతం మార్కులతో పాన్సైన విద్యార్థులు. (SC /ST విద్యార్థులకు 50 శాతం మార్కులు వస్తే చాలు).
- 8వ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.
- విద్యార్థి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం 3,50,000 కంటే తక్కువ ఉండాలి.
- KVS, NVS, సైనిక్ స్కూల్ విద్యార్థులు అర్హులు కాదు.
స్కాలర్షిప్ ఎంత మొత్తం చెల్లిస్తారు?:
- NMMS స్కాలర్షిప్స్ కి రాత పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు, 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు సంవత్సరానికి ₹12,000/- ప్రతి సంవత్సరం చెల్లిస్తారు.
- చెల్లింపు విధానం PFMS ద్వారా విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది.
NMMS స్కాలర్షిప్ పరీక్ష విధానం?:
- MAT ( mental ability test) : రీజనింగ్ మరియు క్రిటికల్ థింకింగ్ టెస్ట్ నుంచి 90 ప్రశ్నలు, 90 నిమిషాలు నిర్వహిస్తారు.
- SAT ( scholarship aptitude test ): సైన్స్, మాథ్స్, సోషల్ సైన్స్ టాపిక్స్ నుంచి 90 ప్రశ్నలు, 90 నిమిషాలు నిర్వహిస్తారు.
- కేటగిరీల వారిగా అర్హత మార్కులు : జనరల్ గ్రూపు విద్యార్థులకు 40%, SC, ST విద్యార్థులకు 32% ప్రతి పేపర్లోనూ రావాలి.
దరఖాస్తు చేసుకునే విధానం:
- ముందుగా NSP OTR నమోదు చేసుకోవాలి – National scholarship portal లో వన్ టైం రిజిస్ట్రేషన్(OTR) నమోదు చేయాలి.
- ఫ్రెష్ లేదా రెన్యూవల్ దరఖాస్తులను జూన్ 2 నుండి ఆగస్టు 31వ తేదీ వరకు చేసుకోవాలి.
- విద్యార్థుల యొక్క పూర్తి వివరాలను రిజిస్ట్రేషన్ ఫారంలో నింపి, ఎటువంటి తప్పులు లేకుండా దరఖాస్తులను సబ్మిట్ చేయాలి.
- ఆదాయ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్స్,స్కూల్ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం వంటి పలు రకాల సర్టిఫికెట్ల వివరాలను అప్లికేషన్లో పూరించాలి.
NMMS Scholarship Official Website
రెన్యువల్ నిబంధనలు:
- ఈ స్కాలర్షిప్స్ ని 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఇస్తున్నందున, ప్రతి సంవత్సరపు తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి.
- 9వ తరగతి నుండి పదవ తరగతికి వెళ్లేటువంటి విద్యార్థులు, ఆ తరగతిలో పాస్ అయి ఉండాలి
- క్లాస్ 11/12 ముందు 10వ తరగతిలో కనీసం 60%, SC, ST విద్యార్థులకు 55% మార్కులతో తిన్నతో పొంది ఉండాలి.
కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ₹12,000/- స్కాలర్షిప్ కోసం ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోండి.