TG POLYCET 2025 Seat Allotmemt Results Delay Reasons:
తెలంగాణ పాలిసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూలై 4వ తేదీన విడుదల కావలసిన అలాట్మెంట్ ఫలితాలు ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఇంటర్లో జాయిన్ అవ్వాలి లేదా కొన్ని రోజులు ఫలితాల కోసం ఎదురు చూడాలనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఈ ఫలితాలు ఆలస్యం కావడానికి మొదట విద్యార్థులు నమోదు చేసిన వెబ్ ఆప్షన్స్ తారుమారు కావడం అని అనుకున్నా, తర్వాత తెలిసిన విషయం ఏమిటంటేపాలిటెక్నిక్ కళాశాలలో ఫీజులు విపరీతంగా పెంచడం అనేది కారణంగా తెలుస్తోంది. ఫీజులు పెంచడం వల్ల వాటిని తగ్గించాలని ప్రభుత్వం భావించింది. ఫీజుల విషయం కొలిక్కి వచ్చిన తర్వాత ఫలితాలను విడుదల చేయాలని ఉన్నత విద్యా మండలి కొన్ని రోజులు ఫలితాలు విడుదల చేయకుండా ఈ సమస్య పూర్తయిన తర్వాత విడుదల చేయాలని భావించింది. అందుకే తెలంగాణ పాలిసెట్ మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలు ఇంతవరకు విడుదల కాలేదు.
సీట్ అల్లౌట్మెంట్ ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి?:
తెలంగాణ పాలిసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలను జూలై 15వ తేదీలలోగా విడుదల చేయనున్నారు. మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాల్లో సీటు పొందిన విద్యార్థులు, సంబంధిత కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు మీ యొక్క ఫలితాలను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TG POLYCET 2025 సీట్ అలాట్మెంట్ ఫలితాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
తెలంగాణ పాలిసెట్ 2025 సీట్ అలాట్మెంట్ ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ జిల్లా కోర్టు 2025 పరీక్షల షెడ్యూల్ మరియు హాల్టికెట్స్ డౌన్లోడ్ తేదీ
- ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజ్ లో “Candidate Login” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క వివరాలను enter చేసి సబ్మిట్ చేయండి
- స్క్రీన్ పైన “Seat Allotment Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- వెంటనే మీకు వచ్చిన కాలేజీ, బ్రాంచ్ వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.
TG POLYCET 2025 Seat Allotment Results
FAQ’s:
1. పాలిసెట్ సీట్ అలాట్మెంట్ ఫలితాలు ఇంకా విడుదల కాలేదు కదా నేను ఇంటర్ లో జాయిన్ అవుదామని అనుకుంటున్నాను?. జాయిన్ అవ్వచ్చా?. లేదా మరికొన్ని రోజులు వేచి ఉండాలా?.
జవాబు. మరి కొద్ది రోజుల్లో సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదలవుతాయి. మీరు ఇప్పుడే ఇంటర్లో జాయిన్ అవ్వాలి అనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు.
2. తెలంగాణ పాలిసెట్ సీట్ అలాట్మెంట్ ఫలితాలు ఆలస్యం కావడానికి గల కారణాలు ఏమిటి?.
జవాబు. పాలిటెక్నిక్ కళాశాలలో ఫీజులను అధికంగా పెంచడమే దీనికి కారణం. ఫీజులను తగ్గించిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల చేసి, తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావించినందున, జూలై 4న విడుదల చేయాల్సిన ఫలితాలను వాయిదా వేయడం జరిగింది.