Annadhatha Sukhibhava Scheme 2025: అర్హుల జాబితా వచ్చింది- ₹7,000/- డిపాజిట్ అయ్యే తేదీ ఇదే: మీ పేరు చెక్ చేసుకోండి.

Annadhatha Sukhibhava Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ 2025 మొదటి విడత డబ్బులను విడుదల చేయడానికి అధికారిక తేదీని ప్రకటించింది. జూలై 18, 2025న లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో ₹7,000/- డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అర్హులైన లబ్ధిదారుల జాబితా ని విడుదల చేసిన అధికారులు, ఆ జాబితాలో పేర్లు లేని రైతులు జూలై 13వ తేదీలోగా అభ్యంతరాలను సబ్మిట్ చేయాలని సూచించింది. రైతులు వారు ఈ పథకానికి లబ్ధిదారులు అవునా కాదా తెలుసుకోవడానికి, అధికారిక వెబ్సైట్లో స్టేటస్ లింక్ యాక్టివేట్ చేశారు. అక్కడ రైతుల యొక్క 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించినపూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు డిపాజిట్ అయ్యే తేదీ?:

అన్నదాత సుఖీభవ పథకం 2025 మొదటి విడత డబ్బులను జూలై 18వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ రోజున అర్హులైన రైతులకు ఖాతాల్లో నేరుగా ₹7000/- రూపాయలు మొదటి విడతగా డిపాజిట్ అవుతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ₹2,000/-, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ₹5,000/- కలిపి రైతుల అకౌంట్లో జూలై18వ తేదీన డిపాజిట్ చేస్తారు.

Join WhatsApp Group

అర్హుల జాబితా విడుదల- మీ పేరు ఎలా చూసుకోవాలి?:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అర్హతల జాబితాను విడుదల చేసింది. ఈ పథకానికి మీరు అర్హులా కాదా తెలుసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.

ఏపీ జిల్లా కోర్టు పరీక్షల తేదీలు విడుదల చేశారు : హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి

  1. ముందుగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ పేజ్ లో ” check status ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. రైతు యొక్క 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, పక్కనే ఉన్న కాప్చ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  4. వెంటనే రైతు యొక్క పేరు, గ్రామం, మండలం, జిల్లా, అర్హుడు అయినట్లయితే Eligible అని, eKYC పూర్తయినట్లయితే Completed అని స్క్రీన్ పైన పూర్తి వివరాలు చూపిస్తుంది.
  5. ఇలా ఉన్నట్లయితే ఆ రైతు ఈ పథకానికి అర్హుడు అని అర్థం.
  6. వారికి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు డిపాజిట్ అవుతాయి.

Annadhatha Sukhibhava Scheme : Status Check Website

అర్హులు కాని వారికి మరొక అవకాశం:

అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు కాని వారు జూలై 13 వ తేదీలోగా సంబంధిత రైతు సేవా కేంద్రానికి వెళ్లి, అక్కడ అధికారులను సంప్రదించి గ్రీవెన్స్ (అభ్యంతరాల) ఫారంను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు అధికారులు వారి యొక్క అభ్యంతరాలను పరిశీలించి, అర్హత ఉన్నట్లయితే వారి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తారు.

కావున అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల జాబితాను పైన తెలిపిన విధంగా వెంటనే వెబ్సైట్లో కాని లేదా దగ్గర్లోని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి చెక్ చేసుకోండి