Postal GDS 2025 5th Merit List Results:
పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రామీణ డాక్ సేవక్ గా పని చేయడానికి సంబంధించి ఫిబ్రవరి, 2025 లో 21,423 పోస్టులతో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల వారు సంబంధిత పోస్టల్ సర్కిల్స్ లో ఉన్నటువంటి ఖాళీలకు అప్లై చేసుకునే విధంగా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఈ పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకి సంబంధించి నాలుగు మెరిట్ లిస్టు ఫలితాలను విడుదల చేశారు. ఈరోజు 5వ మెరిట్ లిస్టు ఫలితాలను కూడా విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు, ఐదో మెరిట్ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే మీరు డిపార్ట్మెంట్ వారు రిజల్ట్స్ లో ఇచ్చినటువంటి ఆఖరి తేదీలోగా సర్టిఫికెట్ల పరిషనులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఫలితాలను చూసుకున్న తర్వాత అందులో మీ పేరు ఉన్నట్లయితే కచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కావాలి. ఈ ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టల్ జిడిఎస్ 2025 జాబ్స్ వివరాలు:
- పోస్ట్ పేరు : గ్రామీణ డాక్ సేవక్
- విడుదల చేసిన సంస్థ : పోస్టల్ డిపార్ట్మెంట్
- మొత్తం పోస్టులు : 21,423
- అర్హత: 10వ తరగతి
- రెగ్యులర్ పర్మినెంట్ ఉద్యోగాలు
- ఇప్పటివరకు ఎన్ని మెరిట్ లిస్ట్ లు విడుదల చేశారు: 5 మెరిట్ లిస్టు ఫలితాలు విడుదల చేశారు
- ఈరోజు విడుదలైన మెరిట్ లిస్ట్ ఏమిటి?: 5వ మెరిట్ లిస్ట్
పోస్టల్ జిడిఎస్ 2025 5th మెరిట్ లిస్టు ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:
పోస్టల్ జిడిఎస్ 5వ మెరిట్ లిస్ట్ ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితా వారికి రేపు డబ్బులు డిపాజిట్ చేస్తారు: మీ పేరు చూసుకోండి
- ముందుగా పోస్టల్ జిడిఎస్ 2025 అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి
- అక్కడ “GDS online engagement 2025 5th Merit List” ఆప్షన్ ఎంచుకోండి
- రాష్ట్రాలవారీగా మీకు ఫలితాలు వివరాలు చూపిస్తుంది
- ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలకు సంబంధించి మీరు ఏ రాష్ట్రానికి అప్లై చేసుకున్నారో ఆ రాష్ట్రం లింక్ పై క్లిక్ చేయండి.
- ” Supplementary list V” పై క్లిక్ చేయండి.
- వెంటనేఫలితం యొక్క పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
- అందులో మీ యొక్క ” రిజిస్ట్రేషన్ నంబర్” తో ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
- మీ పేరు ఉన్నట్లయితే ఆఖరి తేదీలోగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి హాజరవ్వండి.
Postal GDS 2025 : AP 5th Merit List PDF
Postal GDS 2925 : TG 5th Merit List PDF
Postal GDS 2025 Official Website
FAQ’s:
1. పోస్టల్ జిడిఎస్ 2025 మరొక్క మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారా?
5వ మెరిట్ లిస్టులో పేర్లు ఉన్న అభ్యర్థులు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కు హాజరు కానట్లయితే, వారి స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వడం కోసం 6వ మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేయడం జరుగుతుంది.
2. 5th మెరిట్ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు ఏ తేదీలోగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కావాలి?.
జూలై 24వ తేదీలోగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి హాజరు కావలసి ఉంటుంది
