AP Thalliki Vandanam Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పింది. మొదటి విడతలో డబ్బులు డిపాజిట్ కాని వారికి, అభ్యంతరాన్ని పరిశీలించిన తర్వాత అర్హులైన 9.51 లక్షల మందికి రెండవ విడతలో ₹13,000/- రేపు అనగా జూలై 10వ తేదీన తల్లుల ఖాతాలో డిపాజిట్ చేయనున్నారు. మొదటి తరగతిలో జాయిన్ అయ్యే విద్యార్థులు, ఇంటర్ ఫస్టియర్ లో జాయిన్ అయ్యే విద్యార్థులు, CBSE, ఇతర బోర్డులకి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లుల అకౌంట్లో కూడా డబ్బులు డిపాజిట్ చేయడానికి ప్రభుత్వం అర్హుల జాబితాను సిద్ధం చేసింది. జూలై 10వ తేదీన జరగబోయే పేరెంట్ టీచర్ మీటింగ్ లో అర్హులైన తల్లుల అకౌంట్లో వారికి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు 13 వేల రూపాయల చొప్పున డబ్బులు డిపాజిట్ చేయమన్నారు.
జూలై 10న ఎవరికి డబ్బులు డిపాజిట్ అవుతాయి?:
తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత జాబితాలో పేర్లు ఉన్న ఈ క్రింది వారే తల్లుల ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ గా ఉన్నాయి.
- ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ తల్లులకు
- మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ లో జాయిన్ అయినా పిల్లల తల్లులకు
- CBSE, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ కానున్నాయి.
- గతంలో వీరిని మినహాయించి డబ్బులు డిపాజిట్ చేసిన విషయం తెలిసిందే.
- ఇప్పుడు వీరిని కూడా అర్హులు జాబితాలో చేరుస్తూ,రెండో విడతలో నిధులు విడుదల చేయనున్నారు.
- రెండవ విడతలు మొత్తం 9.51 లక్షల మంది లబ్ధిదారులకు డబ్బులు డిపాజిట్ కానున్నాయి
అర్హుల జాబితా ఎలా చెక్ చేసుకోవాలి?:
ఈరోజు భారత్ బంద్: మరి స్కూల్స్, కాలేజెస్, బ్యాంకులు పనిచేస్తాయా లేదా?
- రెండో విడత జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి మీ దగ్గరలోని గ్రామా లేదా వార్డు సచివాలయానికి వెళ్లి అక్కడ అర్హుల జాబితా అని అడిగి చెక్ చేసుకోవచ్చు.
- లేదా, మీ మొబైల్ లోని ఆంధ్రప్రదేశ్ మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా చూసుకోవచ్చు.
- అలాగే అధికారికి వెబ్సైట్లో తల్లికి వదలకు పథకాన్ని ఎంపిక చేసుకొని మీ పేరు సరిచూసుకోవచ్చు .
ఎంత డబ్బు డిపాజిట్ అవుతుంది?:
RRB NTPC 2025 అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షల అప్లికేషన్ స్టేటస్ లింక్ వచ్చింది
- తల్లికి వందనం పథకానికి మొదటి విడతల విడుదల చేసిన విధంగానే ₹15,000/- లకు బదులుగా ₹13,000/- రూపాయలు డిపాజిట్ కానున్నాయి.
- ₹2,000/- స్కూల్ మెయింటెనెన్స్ కోసం మినహాయించునున్నారు.
అర్హతలేని వారు మళ్లీ ఫిర్యాదు చేయవచ్చా?:
అర్హుల జాబితాలో పేరు లేని లబ్ధిదారులు, మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి మళ్లీ ఫిర్యాదు చేసుకోవచ్చు. మీకు అర్హతలు ఉన్నట్లయితే అధికారులు పరిశీలించి, మీ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది.
ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి?:
- తల్లికి వందనం పధకం ద్వారా పిల్లలను పాఠశాలలకు పంపించే తల్లులకు ఆర్థిక సహాయం చేసి, వాడు పిల్లలను మంచిగా చదివించడానికి తోడ్పాటును కల్పించే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది.
- గతంలో అమ్మవడి పథకం కింద ఇదేవిధంగా గత ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా తల్లికి వందనం పేరుతో లబ్ధిదారులకు డబ్బులు డిపాజిట్ చేస్తోంది.