TG TET 2025 June Answer Key:
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 జూన్ నెలలో నిర్వహించినటువంటి పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ లను విద్యాశాఖ అధికారులు ఈరోజు అనగా జూలై 5వ తేదీన విడుదల చేశారు.జూన్ 18 నుండి జూన్ 30వ తేదీ వరకు రోజుకి రెండు షిఫ్ట్స్ వారీగా ఆన్లైన్లో కంప్యూటర్ ఆధార్ కార్డు రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపుగా 1.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని రాతపరులకు సబ్జెక్టుల వారిగా హాజరయ్యారు. అయితే ఇప్పుడు ప్రాథమిక ఆన్సర్ కీ లను డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఆక్టివేట్ చేయడం జరిగింది. అభ్యర్థులు ప్రాథమిక ఆన్సర్ కీ లను డౌన్లోడ్ చేసుకొని అందులో ఏమైనా తప్పులు గమనించినట్లయితే, అభ్యంతరాలను సబ్మిట్ చేసుకోవడానికి జూలై 8వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఆన్సర్ కి డౌన్లోడ్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ టెట్ 2025 ప్రాథమిక ఆన్సర్ కి విడుదల చేసే తేదీ మరియు సమయం?:
తెలంగాణ టెట్ 2025 ప్రాథమిక ఆన్సర్ కీని జూలై ఐదో తేదీ ఉదయం 10 గంటలకు అధికారులు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు వారి యొక్క క్రెడియన్షియల్స్ తో లాగిన్ అయ్యి ఆన్సర్ కీ ని డౌన్లోడ్ చేసుకొని, ప్రాథమిక కిలో ఏమైనా తప్పులు గమనించినట్లయితే, అభ్యంతరాలను సబ్మిట్ చేసుకోవడం ద్వారా వారికి మార్కులు కలిసే అవకాశం ఉంటుంది.
- ఆన్సర్ కీ విడుదల తేదీ: జూలై 5, 2025
- అభ్యంతరాలు (Objections) పెట్టుకునే ఆఖరి తేదీ: జూలై 8, 2025.
ఏపీ మెగాడీఎస్సి 2025 ఫైనల్ రిజల్ట్స్ మరియు అపాయింట్మెంట్ ఆర్డర్స్ డేట్స్
TG TET 2025 ప్రాథమిక ఆన్సర్ కి అలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
తెలంగాణ స్టేట్ 2025 ప్రాథమిక ఆన్సర్ కిని ఈ క్రింది స్టెప్ వేస్తే ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ముందుగా తెలంగాణ టెట్ 2025 అధికారిక వెబ్సైట్ (Website Link)ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజీలో “TG TET 2025 Answer Key” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన ప్రాథమిక ఆన్సర్ కీ పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతాయి.
- ప్రాథమిక కీలో ఇచ్చిన సమాధానాలు మీరు నమోదు చేసిన సమాధానాలు రెండు కరెక్ట్ గా అవుతున్నాయో లేదో చెక్ చేసుకోండి.
- ప్రాథమిక ఆన్సర్ కీ లో తప్పులు గమనించినట్లయితే, అభ్యంతరాలను సబ్మిట్ చేయండి మీకు మార్కులు కలుస్తాయి.
TG TET 2025 Answer Key Download
FAQ’s:
1. తెలంగాణ స్టేట్ 2025 ప్రాథమిక ఆన్సర్ కీ ని ఏ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలి?
https://tgtet.aptonline.in/tgtet/ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు
2. తెలంగాణ టెట్ 2025 పరీక్షలకు మొత్తం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు?
1.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని, పరీక్షలకు హాజరయ్యారు
