TG POLYCET 2025:
తెలంగాణ పాలిసెట్ 2025 మొదటి విడత కౌన్సిలింగ్ కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ ని నిన్న రిలీజ్ చేయాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాలవల్ల ఈరోజు ఫలితాలను విడుదల చేయనున్నారు. నిన్న ఫలితాలు విడుదలవుతాయని ఎంతగానో ఎదురు చూసిన అభ్యర్థులు, ఫలితాలు విడుదల కాకపోవడంతో చాలా నిరాశకు గురయ్యారు. అయితే ఈరోజు సీట్ అలాట్మెంట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయమన్నారు. మొత్తం 80 వేల మంది తెలంగాణ పాలిసెట్ 2025 రాత పరీక్షల్లో అర్హత పొందారు. ఇందులో చాలామంది మొదటి విడత కౌన్సెలింగ్ లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చినవారున్నారు. మొదటి విడత సీట్ అలాట్మెంట్ పూర్తయిన తర్వాత జూలై 9వ తేదీ నుండి రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు మొదటి విడత సీట్ అలాట్మెంట్ కి సంబంధించిన ఫలితాలు ఎలా చూసుకోవాలి అనేది ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
తెలంగాణ పాలిసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ విడుదల చేసే తేదీ మరియు సమయం :
తెలంగాణ పాలిసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలను జూలై 5వ తేదీ సాయంత్రంలోగా విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. జూలై 4వ తేదీన విడుదల చేయాల్సినటువంటి ఫలితాలను కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేకపోయినట్లు, ఈరోజు ఆ ఫలితాన్ని విడుదల చేయనున్నట్లుగా ప్రకటించడం జరిగింది. మొదటి విడత వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న అభ్యర్థులు ఈరోజు అధికారిక వెబ్సైట్ నుండి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ పాలిసెట్ 2025 సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి?:
సీట్ అలాట్మెంట్ ఫలితాలను చెక్ చేసుకోవడానికి క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి.
TG TET 2025 ప్రాథమిక ఆన్సర్ కి, రిజల్ట్స్ విడుదల
- ముందుగా తెలంగాణ పాలిసెట్ అధికారిక వెబ్సైట్ (Website Link) ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో “Candidate Login” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అభ్యర్థుల యొక్క క్రెడియన్షియల్స్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- డౌన్లోడ్ సీట్ అలాట్మెంట్ అనే ఆప్షన్ పెట్టి చేయండి.
- వెంటనే మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది
- అందులో మీరు ఏ కాలేజీకి, ఏ బ్రాంచ్ కి ఎంపికయ్యారు అనేది చెక్ చేసుకోండి
TG POLYCET 2025: Seat Allotment Results
FAQ’s:
1. తెలంగాణ పాలిసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ తర్వాత ఫీజు చెల్లింపు మరియు సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్ ఏమిటి?
గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 4వ తేదీ నుండి జూలై ఆరో తేదీ వరకు మీరు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
2. రెండవ విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది?
జూలై 9 నుండి రెండో విడత తెలంగాణ పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
