TS POLYCET 2025 Seat Allotment Results:
తెలంగాణ పాలీసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ (TS policy 2025 Phase 1 seat allotment results ) ఫలితాలను జూలై 4, 2025వ తేదీన విడుదల చేశారు. మొదటి విడత కౌన్సెలింగ్కు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు వారి యొక్క సీట్ అల్లౌట్మెంట్ వివరాలను అధికారిక వెబ్సైట్ https://tgpolycet.nic.in/ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. సీట్ అల్లౌట్ మెంట్ ఫలితాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
TS POLYCET 2025 సీట్ అలాట్మెంట్ ముఖ్యమైన తేదీలు?:
| అంశము | తేదీలు |
| మొదటి విడత సీట్ల కేటాయింపు విడుదల తేదీ | జూలై 4, 2025 |
| ఫీజు చెల్లింపు మరియు సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీ | జూలై 4 నుండి జూలై 6, 2025 వరకు |
| రెండవ విడత కౌన్సిలింగ్ ప్రారంభ తేదీ | జూలై 9, 2025 |
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:
తెలంగాణ టెట్ 2025 ప్రాథమిక ఆన్సర్ కి రిజల్ట్స్ విడుదల
- అభ్యర్థుల ముందుగా అధికారిక వెబ్సైట్ https://tgpolycet.nic.in/ ఓపెన్ చేయండి.
- “Phase 1 seat allotment Results 2025” లింక్ పై క్లిక్ చేయండి
- మీ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
- మీకు కేటాయించిన కాలేజీ కాలేజీ వివరాలు, అల్లౌట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- ఫీజు చెల్లించి ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
ఫీజు చెల్లింపు వివరాలు:
తెలంగాణ బాసర IIIT 2025 ఫలితాలు విడుదల
- ఫీజు చెల్లింపు ఆఖరు గడువు : జూలై 6, 2025
- ఆన్లైన్ పేమెంట్ విధానంలో ఫీజు చెల్లించవలెను
- మీరు ఫీజు చెల్లించకపోతే మీ సీట్ అలాట్మెంట్ ఆటోమేటిక్ గా రద్దు అవుతుంది.
అవసరమైన డాక్యుమెంట్స్ వివరాలు?:
- సీట్ అలాట్మెంట్ ఆర్డర్
- ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్
- పదవ తరగతి మార్క్స్ మెమో
- కుల ధ్రువీకరణ పత్రాలు
- ఆధార్ కార్డు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫర్లు
రెండో విడత కౌన్సిలింగ్ ఎప్పుడంటే?:
- రెండో విడత కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే తేదీ : జూలై 9 నుండి ప్రారంభమవుతుంది
- ఇప్పటికే సీటు వచ్చినా మార్పు కోరే వారు కూడా, వెబ్ ఆప్షన్స్ మార్చుకొని మళ్లీ పాల్గొనవచ్చు
- కొత్తగా అప్లై చేసే వారు కూడా ఈ రెండవ విడత కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు.
TS polycet 2025 Phase 1 seat allotment order: Click Here
విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు?:
- సీటు వచ్చిన వారు తప్పనిసరిగా ఫీజు చెల్లించాలి, లేనియెడల మీయొక్క సీటు రద్దు అవుతుంది
- సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తిగా చేశాకే, మీరు సీటును కన్ఫర్మ్ చేసుకున్న వారిగా పరిగణిస్తారు.
- phase 2 లో ఇంకా మంచి కాలేజీ వస్తుంది అనుకుంటే తప్ప, ప్రస్తుతం వచ్చిన సీట్ ని వదులుకోకండి
తెలంగాణ పాలిసెట్ 2025 తాజా సమాచారం కోసం మా www.freejobsintelugu.com నీ ప్రతిరోజు విజిట్ చేయండి. సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ కాలేజీలో సీటు వచ్చింది, మీ అనుభవం ఏమిటి, మీకు నచ్చిన కాలేజీలో సీటు వచ్చిందా లేదా అనే పూర్తి వివరాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలపండి.
