AP RGUKT IIIT 2025 2nd Phase Results : Check Results @admissions25.rgukt.in/

AP RGUKT IIIT 2025 – 2nd Phase Results:

ఆంధ్రప్రదేశ్ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ 2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఇందులో నూజివీడు త్రిబుల్ ఐటీ లో నాలుగు రోజుల సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనటువంటి విద్యార్థుల్లో 866 మంది సీటు సంపాదించారు. వీరిలో బాలురు 243 మంది, బాలికలు 623 మంది ఉన్నారు. రెండో రోజు జరిగిన కౌన్సిలింగ్లో 547 మంది విద్యార్థులను పిలువగా, 429 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. మొదటి విడత కౌన్సిలింగ్ తర్వాత మిగిలిపోయిన 234 సీట్లను తర్వాతి మెరిట్ జాబితా ప్రకారం రెండవ విడత కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు. రెండవ విడత మెరిట్ జాబితా ఎప్పుడు విడుదల చేస్తారు?, రెండో విడత కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

మొదటి విడత కౌన్సిలింగ్ లో ప్రవేశాలు పొందినవారు, మిగిలిపోయిన సీట్ల వివరాలు:

నూజివీడు త్రిబుల్ ఐటీ క్యాంపస్ లో ప్రవేశాల కోసం నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్లో ఎంతమంది ఎంపికయ్యారు?, ఎన్ని సీట్లు మిగిలిపోయాయి పూర్తి వివరాలు ఈ క్రింది డేటా ప్రకారం చూడండి.

Join WhatsApp group

నూజివీడు త్రిబుల్ ఐటీ లో ప్రవేశం పొందిన మొత్తం విద్యార్థులునూజివీడు త్రిబుల్ ఐటీకి మొదటి విడత కౌన్సిలింగ్లో 866 మంది ఎంపికయ్యారు.
మిగిలిపోయిన మొత్తం సీట్లు234 సీట్లు నూజివీడు త్రిబుల్ ఐటీ క్యాంపస్ లో మిగిలిపోయాయి.

మిగిలిపోయినటువంటి సీట్లను రెండవ విడత మెరిట్ జాబితా విడుదల చేసి, రెండవ విడత కౌన్సిలింగ్ ప్రక్రియలో సీట్లను భర్తీ చేయడం జరుగుతుందని అధికారులు మీడియాకు తెలిపారు.

TG IIIT బాసర 2025 మెరిట్ లిస్టు ఫలితాలు విడుదల

రెండవ విడత మెరిట్ జాబితా విడుదల తేదీ?:

ఆంధ్రప్రదేశ్ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ 2025 రెండవ విడత మెరిట్ జాబితాను ఈ వారంలో విడుదల చేయనున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో మిగిలిపోయినటువంటి సీట్లను భర్తీ చేయడానికి, మెరిట్ లిస్ట్ ప్రకారం, జాబితాలో ఉన్న తదుపరి విద్యార్థులను సెకండ్ మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేసి, రెండవ విడత కౌన్సిలింగ్ కు ఆహ్వానిస్తారు.

రెండో విడత జాబితా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

ఏపీ త్రిబుల్ ఐటీ 2025 రెండవ విడత కౌన్సెలింగ్ కి హాజరవ్వాలి అనుకునే విద్యార్థులు, ఈ క్రింది సబ్జెక్టు ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా సెకండ్ మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు : Full డీటెయిల్స్

  1. ముందుగా AP RGUKT IIIT 2025 వెబ్సైట్ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో “AP IIIT 2025 2nd Merit List Download” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. వెంటనే సెకండ్ మెరిట్ లిస్ట్ PDF డౌన్లోడ్ అవుతుంది.
  4. ఆ లిస్టులో మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి.
  5. సెకండ్ మెరిట్ లిస్టులో పేరు ఉన్న విద్యార్థులు రెండో విడత కౌన్సిలింగ్ కి సిద్ధమవ్వాలి.

AP RGUKT IIIT 2nd Merit List

పైన తెలిపిన వివరాల ద్వారా సెకండ్ మెరిట్ లిస్టు డౌన్లోడ్ చేసుకుని, సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరవ్వండి.