AP Free Housing For All Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం పేరు అందరికీ ఉచిత ఇళ్ల పట్టాల పథకం 2025. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు 3 సెంట్లు ఇళ్ల స్థలం, అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ దరఖాస్తు ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రింద ఇవ్వబడినటువంటి అర్హతల వివరాలు చూసి మీరు లబ్ధిదారులైనట్లయితే, దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసి వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోగలరు.
ఉచిత ఇళ్ల పట్టాల పథకానికి ఉండవలసిన అర్హత ప్రమాణాలు ఇవే:
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అంటే లబ్ధిదారుడు ఈ క్రింది ఉన్న 7 అర్హతల్లో లబ్ధిదారుడు ప్రతి ఒక్కటి పాటించి ఉండాలి.
- లబ్ధిదారుడు కచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
- లబ్ధిదారుడు ఇతర గృహ నిర్మాణ పథకాల ద్వారా స్థలం పొందకుండా ఉండాలి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పౌరుడై ఉండాలి
- ఇతర రాష్ట్రాల్లో ఇల్లు లేదా స్థలం లేకుండా ఉండాలి
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఇంతకుముందు గృహ పథకాల ద్వారా ఇంటి స్థలం పొందకుండా ఉండాలి
- ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల ద్వారా లబ్ధి పొందకుండా ఉండాలి
- అభ్యర్థి కుటుంబానికి 2.5 ఎకరాల మగాడి భూమి లేదా 5.0 ఎకరాల మెట్ట భూమి మించకుండా ఉండాలి.
పైన తెలిపిన ఈ అర్హతలు కలిగిన లబ్ధిదారులకు కచ్చితంగా ఇళ్లపట్టాలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది.
ఏపీ తల్లికి వందనం పథకం రెండవ విడత డబ్బులు విడుదల జూలై 5వ తేదీ వాయిదా : కొత్త డేట్ ఇదే
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:
- గ్రామ లేదా వార్డు సచివాలయ కార్యాలయం ద్వారా దరఖాస్తు ఫారం తీసుకొని, అది పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
- ఇటీవల అప్డేట్ చేసుకున్న తెల్ల రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ వంటి పత్రాలను దరఖాస్తు ఫారానికి జత చేయాలి.
- పూర్తి వివరాలతో నింపినటువంటి దరఖాస్తు ఫారాన్ని ,సంబంధిత సచివాలయంలోఅందించాలి.

గమనిక : ఈ పథకం కింద ఉచిత ఇళ్ల స్థలం పొందాలంటే కచ్చితంగా పేదరికం నిరూపించే పత్రాలు,అలాగే పూర్వపు కాలంలో స్థలం ప్రభుత్వము నుండి పొందకపోవడం వంటి ప్రమాణాలు కలిగి ఉండాలి. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే రాష్ట్రంలో ప్రారంభించిన సామాజిక హిత పథకం.
అన్నదాత సుఖీభవ పథకం “Status Check” లింక్ ఆక్టివేట్ చేశారు : Eligible లిస్ట్ చూడండి
దరఖాస్తు ప్రారంభ తేదీ మరియు చివరి తేదీ?:
ప్రస్తుతం అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మీ దగ్గరలోని గ్రామా లేదా వార్డు సచివాలయంలో ఆఖరి తేదీ వివరాలు తెలుసుకొని, వెంటనే దరఖాస్తు ఫారాలు పూర్తి చేసి సబ్మిట్ చేసుకోగలరు.
ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.
