AP EAMCET 2025:
ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల అయిన తర్వాత చాలామంది విద్యార్థులు చూపు గుంటూరులో ఫేమస్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకటైనటువంటి RVR & JC కాలేజీ వైపే ఉంటుంది. ఈ కాలేజీలో సీటు సంపాదించి మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా, ఒక మంచి కంపెనీలో జాబ్ సాధించాలని చాలామంది విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా RVR & JC లో ఎంత ర్యాంకు వచ్చిన వారికి క్యాటగిరీల వారీగా సీటు వస్తుందో పూర్తి సమాచారం ఇప్పుడు గత సంవత్సరాల కటాఫ్ ర్యాంక్స్ ని ఆధారంగా చేసుకుని చూద్దాం.
RVR & JC College పూర్తి వివరాలు:
- లొకేషన్ : చౌడవరం, గుంటూరు
- అఫిలేషన్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
- ఎక్రెడిడేషన్ : NAAC A+ | NBA Accredited Branches
- టాప్ బ్రాంచెస్ : CSE, ECE, ఐటీ, AI & ML, Data Science, EEE, MECH, CIVIL
2024 Cut Off Ranks ప్రకారం 2025 Expected Cut Off Ranks:
ఈ క్రింద ఇవ్వబడిన లిస్టు గతేడాది 2024 ఫైనల్ ఫేస్ కౌన్సిలింగ్ ఆధారంగా Tentative ర్యాంకు కట్ ఆఫ్ వివరాలు:
AP ఎంసెట్ 2025, ఇంటర్ అర్హత పొందినవారు జూలై 6th లోగా Form పూర్తి చెయ్యాలి
| Branch | OC Boys | OC Girls | BC-A | BC-B | BC-D | SC | ST | EWS |
| CSE | 4,800 | 5,400 | 7,000 | 6,500 | 6,200 | 20,000 | 21,000 | 6,000 |
| AI, & ML | 7,200 | 8,100 | 10,000 | 9,300 | 8,900 | 23,000 | 24,000 | 8,500 |
| IT | 6,300 | 6,800 | 8,200 | 7,500 | 7,100 | 21,500 | 22,000 | 7,000 |
| ECE | 9,000 | 9,800 | 11,000 | 10,200 | 9,900 | 25,000 | 26,500 | 9,000 |
| EEE | 13,500 | 14,000 | 15,500 | 14,200 | 13,800 | 30,000 | 31,000 | 13,000 |
| Civil | 22,000 | 24,000 | 25,000 | 23,000 | 38,000 | 38,000 | 40,000 | 21,000 |
| MECH | 20,000 | 21,000 | 22,000 | 20,500 | 35,000 | 35,000 | 37,000 | 19,500 |
Note: ఈ కటాఫ్ ర్యాంక్ వివరాలు 2024 కటాఫ్ ర్యాంకుల ఆధారంగా ఉన్నటువంటి స్పష్టమైన డేటా. అయితే 2025 కౌన్సిలింగ్ లో ఈ ర్యాంకుల్లో కొంతమేర మార్పు ఉండవచ్చు.
తల్లికి వందనం పధకం 5వ తేదీ డబ్బులు జమ వాయిదా, కొత్త తేదీలు విడుదల
కేటగిరీల వారీగా కనీసం ఉండవలసిన ర్యాంక్ రేంజ్(All Branches Average):
- OC : 15,000 కంటే తక్కువ ఉంటే చాలు – టాప్ బ్రాంచ్ లు: CSE, IT, AI – ML
- BC(A, B, C, D): 18,000 కంటే తక్కువ ఉంటే చాలు : CSE/IT/ECE లో సీటు వచ్చే మంచి అవకాశాలు ఉన్నాయి.
- SC/ST : 30,000 నుండి 40,000 మధ్య ర్యాంక్ ఉండాలి : CIVIL, EEE, MECH బ్రాంచెస్ అందుబాటులో ఉంటాయి.
- EWS: 12,000 తక్కువ రంగు ఉండాలి : CSE, AI-ML బ్రాంచెస్ లో అవకాశం ఉంటుంది.
RVRJC లో అడ్మిషన్ పొందాలంటే ఏం చేయాలి?:
- ఏపీ ఎంసెట్ 2025 లో పైన తెలిపినటువంటి క్యాటగిరీల వారీగా ర్యాంక్స్ వచ్చి ఉండాలి
- APSCHE కౌన్సిలింగ్ లో పాల్గొనాలి.
- మొదటి phase లోనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే సమయంలో RVRJC కాలేజీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి
- కౌన్సిలింగ్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి.
RVRJC లో సీట్ సాధించడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు:
- టాప్ బ్రాంచెస్ లో సీట్ రావాలంటే 8,000 ర్యాంక్ కంటే తక్కువ ఉంటే కచ్చితంగా వస్తుంది.
- రిజర్వేషన్ లో ఉన్న విద్యార్థులకు కొంచెం ఎక్కువ ర్యాంకు వచ్చినా కూడా మొదటి దశ కౌన్సిలింగ్ లోనే సీటు వచ్చే అవకాశం ఉంటుంది.
- కొన్ని mock కౌన్సిలింగ్ టూల్స్ ఉపయోగించి గత సంవత్సర కటాఫ్ ఫ్రాన్స్ ని తెలుసుకోండి.
RVRJC కాలేజ్ ఆంధ్ర ప్రదేశ్ లోనే మంచి పేరు ఉన్న ప్రైవేటు కళాశాలలో ఒకటి. మొదటి దశ ఎంసెట్ కౌన్సిలింగ్ లోనే సీట్ పొందడానికి ఈ కాలేజీలో ఉన్న బ్రాంచెస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి.
