తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు అలెర్ట్: ఆ పిల్లల తల్లులకు ఈరోజు సాయంత్రం వరకే అవకాశం: వారికి ₹13,000/- డబ్బు జమ అవుతుంది.

AP Thalliki Vandanam Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు ముఖ్యమైన సమాచారం. తల్లికి వందనం పథకం లబ్ధిదారులైన తల్లిల పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారిలో “ఇవ్వాళ సాయంత్రం వరకే ఒకటవ తరగతిలో చేరే పిల్లలకే పథకం నగదు జమ అవుతుందని విద్యాశాఖ అధికారులు” తెలిపారు. కావున తల్లికి వందనం పథకం లబ్ధిదారులైన తల్లుల పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఒకటవ తరగతిలో జాయిన్ అయ్యే పిల్లలు ఈరోజు సాయంత్రంలోగా జాయిన్ అయ్యేవిధంగా చూసినట్లయితే వారికి జూలై 5వ తేదీన ₹13,000/- ఎకౌంట్లో జమ అవుతాయి. జూన్ 20వ తేదీ వరకు గ్రీవెన్స్ ఫారం సబ్మిట్ చేసిన లబ్ధిదారుల్లో, అర్హుల 2వ జాబితా వివరాలను అధికారులు విడుదల చేశారు. గ్రామ సచివాలయం మరియు ఆన్లైన్ ద్వారా మీరు రెండో విడత జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.

ఏ తరగతి పిల్లలకు ఈరోజు సాయంత్రం వరకే సమయం ఉంది?:

ఒకటవ తరగతిలో జాయిన్ అయ్యే పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు ఈరోజు సాయంత్రం వరకు ఆ తరగతిలో జాయిన్ అయినట్లయితే, ఆ పిల్లల తల్లులకు కూడా నగదు జమ అవడం జరుగుతుంది అని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. కావున అటువంటి పిల్లల తల్లులు, వారి యొక్క పిల్లలను ఈరోజు సాయంత్రంలోగా ఒకటవ తరగతిలో జాయిన్ చేయించి, ఆ వివరాలను వెంటనే గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ కు తెలియజేసినట్లయితే, జూలై 5వ తేదీన వారికి కూడా తల్లికి వందనం పధకం కింద నగదు జమ చేయడం జరుగుతుంది.

Join WhatsApp Group

2వ విడత జాబితా Eligible లిస్ట్ లో పేరు ఎలా చూసుకోవాలి?:

డబ్బులు డిపాజిట్ అయ్యే తేదీ:

ఏపీ ప్రభుత్వం మహిళల కోసం మరొక పథకం ప్రారంభించింది: ₹2 లక్షల వరకు లోన్ ఇస్తారు

తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితాలో పేరు ఉన్న లబ్ధిదారుల తల్లుల అకౌంట్లో జూలై 5వ తేదీన డబ్బులు డిపాజిట్ అవుతాయి. ₹15,000/- నగదుకి బదులుగా ₹13,000/- డిపాజిట్ అవుతాయి. ₹2,000/- స్కూల్ మెయింటెనెన్స్ కోసం కట్ చేయడం జరుగుతుంది.

రెండవ విడత జాబితాలో కూడా పేరు లేని లబ్ధిదారులు, మరొకసారి అభ్యంతరాలు పెట్టుకునే అవకాశం ఉంటే సబ్మిట్ చేయండి. ఒకవేళ ఆ అవకాశం కూడా లేకపోతే మళ్లీ వచ్చే సంవత్సరం వరకు వేచి చూడాల్సిందే.