Schools bundh Tomorrow:
ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ పాఠశాలలన్నీ రేపు అనగా జూలై 3వ తేదీన బంద్ కానున్నాయి. పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ ఈ బంద్ కు పిలుపునిచ్చింది. తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందువల్ల ఈ బంద్ కి పిలుపునిచ్చామని, అందుకే ఆందోళన చేపడుతున్నామని తెలిపారు.
స్కూల్స్ బంద్ వెనుక ఉన్న కారణాలు ఇవే:
- కారణం: నోటీసులు, అధిక భారం, ఫీజులపై రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ నియంత్రణపై వ్యతిరేకత.
- రాష్ట్రవ్యాప్తంగా 55% కన్నా ఎక్కువ మంది విద్యార్థులకు సేవలందిస్తున్నారంటూ ప్రభుత్వం విమర్శలు చేస్తోంది.
- అసోసియేషన్ ప్రకారం: తాము న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నామని పేర్కొంది.
బంద్ పై అసోసియేషన్ వర్గాల ప్రకటన:
అధికారుల తీరుపై అసోసియేషన్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ” ఫీల్డ్ అధికారులు పాఠశాలల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము న్యాయమైన హక్కుల కోసం నిలబడుతున్నామని, విద్యార్థులపై ప్రభావం లేకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ” అసోసియేషన్ వర్గాలు ప్రకటించాయి.
ఏపీ ఎంసెట్ 2025, ఇంటర్ పరీక్షల్లో అర్హత పొందిన వారు వెంటనే ఈ ఫార్మ్ సబ్మిట్ చేయాలి
ఈ బంద్ వల్ల విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?:
ఈ బంధు పిలుపు ప్రధానంగా ప్రైవేట్ పాఠశాలలపై ప్రభావం చూపనుంది. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు రేపు సెలవు ఉంటుంది. ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలు సాధారణంగా కొనసాగే అవకాశం. తల్లిదండ్రులు తమ పిల్లల పాఠశాల వివరాలు స్కూల్ యాజమాన్యంతో చెక్ చేసుకోవాలి
దీనిపై ప్రభుత్వం స్పందించిందా?:
ప్రభుత్వం తరఫున దీనిపైన ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన రాలేదు. అయితే విద్యాశాఖ ఉన్నతాధికారులు కొన్ని సమస్యలపై సమీక్షలు జరుగుతున్నట్లు సమాచారం. పరిస్థితులను బట్టి తదుపరి చర్యలను ప్రకటించనున్నట్లు తెలుపుతున్నారు.
బంద్ ఉపసంహరణకు అవకాశం ఉందా?:
తమకు ప్రభుత్వం నుంచి పాజిటివ్ స్పందన లభించినట్లయితే, బంద్ ని ఉపసంహరిస్తామని అసోసియేషన్ తెలిపింది. అప్పటివరకు రేపు బంద్ అమలులో ఉంటుందని తెలిపింది.

ముఖ్యమైన విషయం:
రేపు ( జూలై 3 , 2025) ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రైవేట్ పాఠశాలల బంద్ – స్కూల్ విద్యార్థులకు సెలవు. అసోసియేషన్ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన ప్రకటించగా, దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. సంబంధిత స్కూల్ నుంచి అప్డేట్స్ తెలుసుకోవాలి.
