AP EAMCET 2025: 10,000 నుండి 1,60,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుంది – ఇప్పుడే తెలుసుకోండి.

AP EAMCET 2025:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 20025 ఫలితాలు జూన్ 8వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. అయితే జూలై 17వ తేదీ నుండి మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మీకు ఎంసెట్ లో 10000 నుండి 1,60,000 మధ్య ర్యాంకు వస్తే ఏ కాలేజీలలో సీటు వస్తుందో తెలుసుకోవాలనుకునేటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు. మేము ఈ ఆర్టికల్ ద్వారా గత సంవత్సరాల కట్ ఆఫ్ మార్కులను ఆధారంగా చేసుకొని, మీకు ఏ కాలేజీలో సీటు వస్తుందో పూర్తి వివరాలతో కూడిన సమాచారం అందించడం జరిగింది. మీరు ఈ ఆర్టికల్ ని పూర్తిగా చూసి ఏ కాలేజీలో సీటు వస్తుందో ఇప్పుడే తెలుసుకోండి.

10,000 నుండి 25,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి టాప్ ప్రైవేట్ కళాశాలలో సీటు వస్తుంది :

Join WhatsApp group

• CSE /ECE సీటు వచ్చే టాప్ ప్రైవేట్ కళాశాలల వివరాలు :

  • విజ్ఞాన్స్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు
  • శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, భీమవరం
  • వాసిరెడ్డి వెంకటరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గుంటూరు
  • RVR & JC కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, గుంటూరు
  • GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాజాం
  • కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ, మంగళగిరి
  • VR సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, కానూరు
  • గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, గుడ్లవల్లేరు
  • లక్కిరెడ్డి బాల్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, మైలవరం

EEE/MECH/IT బ్రాంచెస్ లో కూడా చాలా సులభంగా సీటు వచ్చే అవకాశం ఉంది.

ఏపీ ఎంసెట్ 2025 మొదటి దశ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు : Official

25,000 నుండి 50000 మధ్య ర్యాంకు వచ్చినవారికి మంచి ప్రైవేట్ కళాశాలలో సాధారణ బ్రాంచెస్ వస్తాయి:

• సీట్ వచ్చే అవకాశం ఉన్న కొన్ని కాలేజీల వివరాలు :

  • లక్కిరెడ్డి బాల్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ మైలవరం
  • విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వైజాగ్ క్యాంపస్
  • గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ , కృష్ణాజిల్లా
  • DNR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, భీమవరం
  • బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, బాపట్ల

CSE/ECE బ్రాంచ్ లకు పోటీ ఎక్కువగా ఉంటుంది, కానీ IT/EEE/EIE లో సీటు వచ్చే అవకాశం ఉంటుంది.

ఏపీ ఎంసెట్ లో ఎంత ర్యాంకు వస్తే మోహన్ బాబు యూనివర్సిటీలో సీటు వస్తుంది

50,000 నుండి 1,00,000 మధ్య ర్యాంక్ వచ్చిన వారికి మిడిల్ రేంజ్ కాలేజీలు, మిక్స్డ్ బ్రాంచెస్ లో అవకాశాలు ఉంటాయి :

• సీటు వచ్చే అవకాశం ఉన్న కాలేజీల వివరాలు :

  • PACE ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఒంగోలు
  • మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్, గుంటూరు
  • ప్రసాద్ V పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజయవాడ
  • MIC మీకు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ , కంచికచర్ల
  • ఆంధ్ర లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ,విజయవాడ

CIVIL, MECH, EEE వంటి బ్రాంచ్ లలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

ఏపీ ఎంసెట్లో ఎంత ర్యాంకు వస్తే KL యూనివర్సిటీలో సీటు వస్తుంది

1,00,000 నుండి 1,60,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి కామన్ ప్రైవేట్ కాలేజీలలో సీటు వచ్చే అవకాశం ఉంది:

• సీటు వచ్చే అవకాశం ఉన్న కాలేజీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి :

  • న్యూటన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, మాచర్ల
  • రైజ్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఒంగోలు
  • ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ
  • స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, నర్సాపూర్
  • అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

ఈ రేంజ్ లో ర్యాంకు వచ్చిన వారికి ఎక్కువగా CIVIL, MECH, IT, MINING, PETROLEUM బ్రాంచుల్లో సీటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

విద్యార్థులు గమనించాల్సిన విషయాలు:

  1. ర్యాంకుతో పాటు విద్యార్థుల కేటగిరి (OC, SC, ST, OBC) కూడా సీట్ అలాట్మెంట్ పై ప్రభావం చూపుతుంది.
  2. వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభమైన వెంటనే, ఎక్కువ కాలేజీలను ఎంపిక చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం చాలా మంచిది.
  3. రెండు ప్రకారంగా చూస్తే CSE/ECE బ్రాంచ్ లకు ఎక్కువ పోటీ ఉంటుంది. కాబట్టి వీటికి ఆల్టర్నేటివ్ గా ఉండేటువంటి బ్రాంచులను సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్ ఇచ్చుకోవాలి.

మరికొద్ది రోజుల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది కావున, విద్యార్థులు మంచి కాలేజీల లిస్టు ప్రిపేర్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ సమయంలో ఆ కాలేజీలతో నమోదు చేయండి.