RRB NTPC 2025 Graduate Answer Keys:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి గ్రాడ్యుయేట్ లెవెల్ కంప్యూటర్ బేస్డ్ ఆధారిత పరీక్షలకి సంబంధించిన ఆన్సర్ కీ లను జూలై 1వ తేదీన విడుదల చేశారు. జూన్ 5 నుండి జూన్ 24వ తేదీ వరకు రోజుకి మూడు విడతల్లో దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. రైల్వే అఫీషియల్ కి ని జూలై 1వ తేదీ సాయంత్రం 6:00 నుండి జూలై 6వ తేదీ రాత్రి 12:00 వరకు డౌన్లోడ్ చేసుకుని, ప్రాథమిక ఆన్సర్ కిలో ఏమైనా తప్పులు గమనించినట్లయితే వాటికి అబ్జెక్షన్స్ ని సబ్మిట్ చేసుకోవచ్చు. రైల్వే NTPC 2025 ఆన్సర్ కీ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
RRB NTPC Answer Key Important Dates:
| అంశము | తేదీ & సమయం |
| ఆన్సర్ కి డౌన్లోడ్, రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ & అబ్జెక్షన్స్ పెట్టుకోవడం. | 1st జూలై, 2025 |
| ఆన్సర్ కి చూసుకునేందుకు & అబ్జెక్షన్స్ పెట్టుకునేందుకు ఆఖరు తేది | 6th జూలై, 2025 |
ఆన్సర్ కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
రైల్వే NTPC 2025 గ్రాడ్యుయేట్స్ స్థాయి పరీక్షల ఆన్సర్ కి ని ఈ క్రింది స్టెప్ లిస్ట్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP DSC 2025 ఫలితాలు విడుదల తేదీ
- ముందుగా రైల్వే అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజీలో ” RRB NTPC 2025 Answer Key” ఆప్షన్ పై క్లిక్ చేయండి .
- అభ్యర్థి యొక్క లాగిన్ ఐడి, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- అభ్యర్థి యొక్క ఆన్సర్ కీ పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
- ఆ రెస్పాన్స్ షీట్ లో ఉన్న సమాధానాలను గమనించండి.
- రైల్వే వారు ఇచ్చిన సమాధానాలలో ఏమైనా తప్పులు గమనించినట్లయితే అబ్జెక్షన్స్ పెట్టుకోండి.
RRB NTPC 2025 Answer Key: Download
అబ్జెక్షన్స్ ఫీజు ఎంత?:
- అబ్జెక్షన్స్ పెట్టుకునే అభ్యర్థులు ₹50/- ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి
- మీరు సబ్మిట్ చేసిన అబ్జెక్షన్ సరైనదే అయితే, మీరు చెల్లించిన ఫీజు కూడా తిరిగి మీ బ్యాంక్ అకౌంట్ లోకి రిఫండ్ అవుతుంది.
AP ప్రభుత్వం మహిళలకు డిజిటల్ లక్ష్మీ పథకం ప్రారంభం : ₹2లక్షలు ఆర్ధిక సహాయం
అభ్యర్థులకు ముఖ్య సూచనలు :
- జూలై 6 2025 మీరు అబ్జెక్షన్స్ ని పెట్టుకోవడానికి, ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆఖరు తేదీ. కావున గడువు ముగిసేలోగా ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకుని అభ్యంతరాలు సబ్మిట్ చేయండి.
- ఫైనల్ ఆన్సర్ కి మరియు ఫలితాలను త్వరలో విడుదల చేస్తారు
ప్రాథమిక ఆన్సర్ కి చూసుకున్న తర్వాత రైల్వే NTPC 2025 CBT-1 ఎగ్జామినేషన్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
