AP Thalliki Vandanam Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు పెద్ద శుభవార్త. జూన్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు పెట్టుకున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, వారి అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత అర్హతలు కలిగినటువంటి వారి యొక్క వివరాలను రెండవ జాబితాలో పొందుపరిచి వారి యొక్క వివరాలను ఈరోజు విడుదల చేయడం జరిగింది. రెండవ జాబితాలో పేర్లు ఉన్న లబ్ధిదారులకు జూలై 5వ తేదీన పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ₹13,000/- విద్యార్థి యొక్క తల్లి అకౌంట్లో డిపాజిట్ కాలున్నాయి. అయితే అభ్యంతరాలు పెట్టుకున్న లబ్ధిదారులు వారి యొక్క పేర్లు రెండవ జాబితాలో ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఏమి చేయాలి, ఎక్కడ ఎలా చెక్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
తల్లికి వందనం పధకం – ఈరోజు ఎవరి జాబితా వచ్చింది?:
తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈరోజు ఎవరి జాబితా విడుదల చేయనున్నారు అంటే :
- జూన్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు నమోదు చేసుకున్నవారు
- జూన్ 28వ తేదీ వరకు ప్రభుత్వం అభ్యంతరాలను పరిశీలించిన లబ్ధిదారుల వివరాలు
2వ విడత జాబితాలో మీ పేరు ఉందా? లేదా? ఎలా చెక్ చేసుకోవాలి?:
ఏపీ తల్లికి వందనం రెండో విడత జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ క్రింది ప్రాసెస్ ని ఫాలో అవ్వండి.
NEET 2025 లో 250-400 మధ్య మార్క్స్ వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుంది
Online ద్వారా అయితే:
- ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా అధికారిక వెబ్సైట్ Website Link
- హోం పేజీలో ” తల్లికి వందనం పథకాన్ని ఎంపిక చేసుకోండి “
- లబ్ధిదారుని యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి
- సబ్మిట్ చేసిన వెంటనే మీరు అర్హులా? కాదా?. ఎంత మనీ వస్తుంది. స్క్రీన్ పైన చూపిస్తుంది
- Whats App ద్వారా అయితే : మొబైల్లో మనమిత్ర సర్వీసెస్ వాట్సాప్ నంబర్ +9195523 00009 సేవ్ చేసుకోండి
- ఆ నంబర్ కి హాయ్ అని మెసేజ్ చేసి, సేవలను ఎంపిక చేసుకొని, తల్లికి వందనం పథకాన్ని ఎంపిక చేసుకొని, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- మీరు అర్హులా కాదా అనేది స్క్రీన్ పైన చూపిస్తుంది.
గ్రామ సచివాలయం ద్వారా అయితే:
- మీ దగ్గరలోని గ్రామా లేదా వార్డు సచివాలయానికి వెళ్లి, అక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారులు సంప్రదించి, రెండవ విడత జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
- మీ పేరు ఉన్నట్లయితే మీకు డబ్బులు డిపాజిట్ అవుతాయి.
- గ్రామ సచివాలయం నోటీస్ బోర్డులో కూడా లిస్టు పెడతారు. చెక్ చేయవచ్చు
AP ఎంసెట్ 2025లో ఎంత ర్యాంకు వస్తే మోహన్ బాబు యూనివర్సిటీలో సీటు వస్తుంది
డబ్బులు ఎప్పుడు డిపాజిట్ అవుతాయి?:
రెండవ విడత జాబితాలో పేర్లు నమోదు అయినవారికి ₹13,000/- ఎప్పుడు డిపాజిట్ అవుతాయి అంటే :
- రెండవ విడత జాబితాలో పేరు ఉన్నవారికి ₹13,000/- జూలై 5వ తేదీన అర్హులైన తల్లి యొక్క బ్యాంకు ఖాతాలో నేరుగా డిపాజిట్ అవుతాయి.
- మొత్తం ₹15,000/- లలో ₹13,000/- డిపాజిట్ చేస్తారు. మిగిలిన ₹2,000/- పాఠశాల మెయింటినెన్స్ కోసం కట్ చేస్తారు
ముఖ్యమైన విషయాలు:
- రెండవ విడత జాబితాలో పేరు లేని వారు, తరువాత విడతల కోసం ఎదురు చూడవచ్చు
- లేదా మీ యొక్క అభ్యర్థన తిరస్కరణపై స్పష్టత కోసం గ్రీవెన్స్ ఫైలింగ్ చేయవచ్చు.
ఈరోజే తల్లికి వందనం బతుకమ్మ రెండవ విడత జాబితా విడుదలవుతున్నందున, గతంలో జూన్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు పెట్టుకున్న లబ్ధిదారులు వెంటనే మీ పేరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి.
