AP DSC 2025 Results:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 16,347 మెగా డీఎస్సీ పోస్టులకు సంబంధించి జూన్ ఆరో తేదీ నుండి జూలై రెండో తేదీ వరకు ఆన్లైన్ లో రోజుకి రెండు నుంచి మూడు విడతల వారీగా పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ పరీక్షలో మరో రెండు రోజుల్లో పూర్తికానున్నటువంటి సందర్భంగా డీఎస్సీ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?, ఫలితాలు విడుదల చేసే తేదీ, ఫలితాలను ఏ వెబ్సైట్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేటువంటి సందేహాలు చాలా మంది అభ్యర్థులలో ఉన్నాయి. ఈ ఆర్టికల్ ద్వారా మీకున్నటువంటి అన్ని సందేహాలను నివృత్తి చేసే విధంగా పూర్తి సమాచారం అందిస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ ఈ ఆర్టికల్ చదివి సమాచారం తెలుసుకోండి.
AP DSC 2025 ఫలితాలు విడుదల తేదీ?:
- AP DSC 2025 ఫలితాలను జూలై 9 వ తేదీ నుండి జూలై 12వ తేదీ మధ్యన విడుదల చేసే అవకాశం ఉంది.
- ఏపీ డీఎస్సీ 2025 కొన్ని పరీక్షలకి సంబంధించిన ఆన్సర్ కీలను ఇప్పటికే విడుదల చేసి అబ్జెక్షన్స్ తీసుకుంటున్నారు.
- గత సంవత్సరాల ట్రెండ్ ప్రకారం చూసుకుంటే, పరీక్షల పూర్తయిన 7 నుండి 10 రోజుల్లో ఫలితాలు విడుదల చేశారు కాబట్టి, ఇప్పుడు కూడా అదే విధంగా ఫలితాలను ఒక పది రోజుల్లో గా విడుదల చేసే అవకాశం ఉంది.
AP DSC 2025 ముఖ్యమైన సమాచారం:
- పరీక్ష తేదీలు: జూన్ 6 నుండి జూలై 2వ తేదీ వరకు
- మొత్తం పోస్టులు : 16,347 (SGT, TGT, PGT, SA, Special Education)
- రెస్పాన్స్ షీట్స్ విడుదల తేది : ఇప్పటికే కొన్ని పరీక్షలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్స్, ప్రాథమిక ఆన్సర్ కీ లను విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్లో చూడండి.
- అబ్జెక్షన్స్ చివరి తేదీ : అధికారిక వెబ్సైట్లు ఇచ్చిన ఆఖరి తేదీ ప్రకారం సబ్మిట్ చేయాలి
- Results expected date : July 9-12, 2025
ఏపీ ప్రభుత్వం మహిళల కోసం డిజిటల్ లక్ష్మీ పథకం ప్రారంభం: ₹2లక్షల ఆర్ధిక సహాయం
AP DSC 2025 రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి?:
- అధికారిక వెబ్సైట్ ఓపెన్ https://apdsc.apcfss.in/ చేయండి.
- ” AP DSC 2025 Results” లింకుపై క్లిక్ చేయండి
- మీ హాల్ టికెట్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి
- సబ్మిట్ చేయగానే మీ యొక్క స్పోర్ట్స్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది
- స్కోర్ కార్డు ని డౌన్లోడ్ చేసుకొని. ప్రింట్ అవుట్ తీసుకోండి.
AP DSC 2025 Results : Official Website
ఫలితాల తర్వాత ఏమి చేయాలి?:
- ఫలితాల్లో క్వాలిఫై అయిన తర్వాత మెరిట్ లిస్టులో మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ , కౌన్సిలింగ్ కు సిద్ధంగా ఉండండి
- సర్టిఫికెట్ల పరిశీలనకు కావలసిన డాక్యుమెంట్స్ ని రెడీ చేసుకోండి.
AP ఎంసెట్ 2025 లో ఎంత ర్యాంకు వస్తే కేఎల్ యూనివర్సిటీలో సీటు వస్తుంది
ముఖ్యమైన సూచనలు:
- ఫలితాలు వచ్చిన వెంటనే అధికారికి వెబ్సైట్ చెక్ చేసుకోండి
- హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఐడి, మరియు ఇతర సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోండి
- మెరిట్ కట్ ఆఫ్ ఆధారంగా, మీ తదుపరి ఎంపిక కోసం ప్రిపేర్ అవ్వండి.
ఏపీ డీఎస్సీ 2025 పరీక్షలు మరో రెండు రోజుల్లో ముగుస్తాయి. ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో పరీక్షలు పూర్తయిన వారం పది రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది.
