TS LAWCET, PGLCET 2025 Results:
తెలంగాణలో లా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన TS LAWCET & PGLCET 2025 ఫలితాలను జూన్ 25వ తేదీ ఉదయం విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గానే ఫలితాలు విడుదల చేయనున్నారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) డిపార్ట్మెంట్ వారు ఫలితాలను విడుదల చేసిన తర్వాత విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ తో లాగిన్ అయ్యి మీ యొక్క ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలతో పాటుగానే ఫైనల్ కీ ని కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం.
TS LAWCET, PGLCET 2025 ఫలితాలు విడుదల తేదీ & సమయం:
తెలంగాణ లా సెట్ మరియు PGLCET 2025 ఫలితాలను జూన్ 25వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. అభ్యంతరాలు సగం చేసిన తర్వాత ఇంతవరకు ఫైనల్ కీ ని డిపార్ట్మెంట్ వారు విడుదల చేయలేదు. అయితే ఫైనల్ కీ తో పాటు ఫైనల్ రిజల్ట్స్ ని కూడా జూన్ 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదల చేసిన తర్వాత అభ్యర్థులు రిజల్ట్స్ తో పాటు ఆన్సర్ కీ ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి.
ఫలితాలను వెబ్సైట్లో ఎలా చెక్ చేసుకోవాలి?:
తెలంగాణ నా సెట్ 2025 ఫలితాలను చెక్ చేసుకోవడానికి క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.
- ముందుగా తెలంగాణ లా సెట్ మరియు పీజీ లా సెట్ 2025 అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో “TS LAWCET, PGLCET 2025 Results” ఆప్షన్ పై చెక్ చేయండి.
- అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన ర్యాంక్ కార్డు డౌన్లోడ్ అవుతుంది
- అది ప్రింట్ అవుట్ తీసుకొని, భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేసుకోండి
- ఫలితాలతో పాటు ఫైనల్ కీ కూడా డౌన్లోడ్ చేసుకొని వెరిఫై చేసుకోండి
TS LAWCET, PGLCET 2025 Results Link
FAQ’s:
1.తెలంగాణ లా సెట్ మరియు పీజీ లాసెట్ 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారు?
కౌన్సిలింగ్ తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరి కొద్ది రోజుల్లో సమాచారం ఇస్తారు
2. ఫలితాలను చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఏమిటి?
https://lawcet.tgche.ac.in/ వెబ్సైట్లో చెక్ చేసుకోండి
