TS EAMCET 2025 Counselling Dates:
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ , అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే TS EAMCET 2025 కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఈరోజు లేదా రేపు తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మరియు షెడ్యూల్ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఎంసెట్ కౌన్సిలింగ్ ముఖ్యమైన వివరాలు:
- తెలంగాణ సాంకేతిక విద్య మండలి (TSCHE) ఆధ్వర్యంలో తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.
- ఇంజనీరింగ్ , అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగాలకు ఈ కౌన్సిలింగ్ వర్తిస్తుంది.
- మొదటి విడతలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ , వెబ్ ఆప్షన్లు, సీట్ అలాట్మెంట్ ప్రక్రియ మొదలవుతుంది.
TS EAMCET 2025 counselling expected dates:
| కౌన్సిలింగ్ దశ | Expected dates |
| నోటిఫికేషన్ విడుదల తేదీ | జూన్ 24 లేదా 25, 2025 |
| ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ | జూన్ 26, 2025 |
| సర్టిఫికెట్ల పరిశీలన తేదీ | జూన్ 28 నుండి జూలై 3 వరకు |
| వెబ్ ఆప్షన్స్ నమోదు చేసే తేదీ | జూలై 1 నుండి 5 వరకు |
| సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల తేదీ | జూలై 7 లేదా 8 |
| కళాశాలలో రిపోర్టింగ్ చేసే తేదీ | జూలై 10వ తేదీలోగా |
Note: పైన తెలిపిన కౌన్సిలింగ్ తేదీలు అంచనా తేదీలు మాత్రమే ఈ రోజు అధికారికంగా నోటిఫికేషన్ విడుదలవుతుంది. అప్పుడు మీకు అఫీషియల్ షెడ్యూల్ తెలుస్తుంది.
NEET 2025 లో 1,40,000 లోపు ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుంది
ఈ సంవత్సరం కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏం మారనుంది?:
- ఈసారి కౌన్సిలింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే వివిధ కాలేజీలో సీట్లు ఖాళీగా ఉండడంతో విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.
ఎంసెట్ కౌన్సిలింగ్ కి ఎలా అప్లై చేయాలి?:
- ముందుగా తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
- ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, Fee పేమెంట్ చేయండి.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ చేసుకోండి
- వెబ్ ఆప్షన్స్ కొరకు వెబ్సైట్లో ఆప్షన్స్ ఎంట్రీ చేయండి
- సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీకు వచ్చిన కళాశాలలో రిపోర్టింగ్ ఇవ్వండి.
తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల తేదీ

కౌన్సిలింగ్ కు అవసరమైన సర్టిఫికెట్స్:
| అవసరమైన సర్టిఫికెట్స్ | వివరాలు |
| తెలంగాణ ఎంసెట్ 2025 హాల్ టికెట్ | తప్పనిసరిగా ఉండాలి |
| తెలంగాణ ఎంసెట్ 2025 ర్యాంక్ కార్డ్ | తప్పనిసరిగా ఉండాలి |
| ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో / ప్రొవిజినల్ సర్టిఫికెట్ | TGBIE/CBSE/AP Board |
| SSC / పదవ తరగతి మార్క్స్ మెమో | పుట్టిన తేదీ ఆధారంగా |
| స్టడీ సర్టిఫికెట్స్ నాలుగో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు | స్థానికత నిర్ధారణకు |
| రెసిడెన్స్ సర్టిఫికెట్స్ | applicable for non local candidates |
| SC, ST, BC, EWS క్యాస్ట్ సర్టిఫికెట్స్ | మీసేవ ద్వారా జారీ చేసినవి |
| ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ | సాధారణ గుర్తింపు కోసం |
| ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ | ఇంటర్మీడియట్ తర్వాత కాలేజ్ TC |
| EWS సర్టిఫికెట్ | only if applicable |
| ఇన్కమ్ సర్టిఫికెట్ | మీసేవ ద్వారా జారీ చేసినవి |
కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల ఏ సమయానికి పైన తెలిపినటువంటి సర్టిఫికెట్స్ ని రెడీ చేసుకోండి. సర్టిఫికెట్ల పరిశీలనకు ఈ ముఖ్యమైనటువంటి ధ్రువపత్రాలు చాలా అవసరం.
