AP RGUKT IIIT 2025 Results:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు సంబంధించినటువంటి 2025 ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 50,541 విద్యార్థులు 4000లకి పైగా ఉన్నటువంటి సీట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఆర్కే వ్యాలీ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం త్రిబుల్ ఐటీలలో వీరికి సీట్లు కేటాయించడం జరిగింది. అలాగే ఈరోజు జిల్లాల వారీగా టాపర్స్ లిస్ట్ కూడా విడుదల చేశారు. జిల్లాల వారీగా ఎంపికైనటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఖాళీల సంఖ్యను కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆర్జీవికేటి త్రిబుల్ ఐటీ ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు ఈ ఆర్టికల్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే మీ యొక్క రిజల్ట్స్ ని వెబ్సైట్ ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోండి.
మొత్తం దరఖాస్తులు మరియు ఎంపికైన వారు?:
- మొత్తం నాలుగు IIIT లకు వచ్చిన దరఖాస్తులు: 50,541
- త్రిబుల్ ఐటీలలో ఉన్నటువంటి ఖాళీల సంఖ్య : 4,040
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల శాతం : 94.78%
రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి?:
ఆంధ్రప్రదేశ్ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ 2025 ఫలితాలను చెక్ చేసుకోవడానికి క్రింది స్టెప్ వేస్తే ప్రాసెస్ ఫాలో అవ్వండి.
- ముందుగా AP RGUKT IIIT 2025 అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజ్ లో “AP RGUKT IIIT 2025 Results Merit List” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- మీకు ఒక పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. అందులో మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి
- మీ పేరు పక్కనే మీరు ఏ త్రిబుల్ ఐటీ క్యాంపస్ కి ఎంపికయ్యారు అనేది ఉంటుంది. అది చూసుకోండి
వాట్సాప్ ద్వారా ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?
విద్యార్థులు ఏపీ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ 2025 ఫలితాలను వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
- విద్యార్థులు ముందుగా మీ మొబైల్లో ఏపీ మనమిత్ర వాట్సాప్ నంబర్ +91 95523 00009 సేవ్ చేసుకొని ఆ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ పెట్టండి
- వెంటనే మీకు సేవలు ఎంచుకోండి అని ఒక మెసేజ్ వస్తుంది
- ఆ మెసేజ్ పై క్లిక్ చేసి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకోండి
- అందులో AP RGUKT IIIT 2025 Results ఆప్షన్ ఎంచుకోండి
- అక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే మీకు ఫలితాలు స్క్రీన్ పైన డౌన్లోడ్ అవుతాయి.
జిల్లాల వారీగా RGUKT IIIT – 20 Toppers List:
ఆంధ్రప్రదేశ్ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ 2025 ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో జిల్లాల వారీగా టాప్ 20 టాపర్స్ లిస్ట్ని ఉన్నత విద్యా మండలి శాఖ విడుదల చేయడం జరిగింది.వారి యొక్క పేర్లు, వారు ఏ క్యాంపస్ కి సెలెక్ట్ అయ్యారు, వారి క్యాటగిరి పూర్తి వివరాలతో లిస్టు విడుదల చేయడం జరిగింది. టాపర్స్ లిస్ట్ కింద ఉన్న లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
AP RGUKT IIIT 2025 Merit List PDF
AP RGUKT IIIT 2025 Toppers List
AP RGUKT IIIT 2025 Results Link
పైన ఉన్న లింక్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ 2025 ఫలితాలను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
