TS EAMCET 2025:
తెలంగాణ ఎంసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేసి ఇప్పటికీ చాలా రోజులు కావస్తోంది. విద్యార్థులు చాలా మంది కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే వారికి ఎంసెట్ రిజల్ట్స్ లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. అయితే 20,000 ర్యాంకు నుండి 1,45,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో ఏ బ్రాంచ్ వస్తుందో గత సంవత్సరాలలో వచ్చిన ర్యాంకులు ఆధారంగా కట్ ఆఫ్ మార్కులను కట్ ఆఫ్ ర్యాంకులను ఆధారంగా చేసుకుని ఈ డేటా ప్రిపేర్ చేయడం జరిగింది.తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ కి హాజరయ్యేవారు ఈ ఆర్టికల్ పూర్తిగా చూసి ఏ కాలేజీలో చూసి వస్తుందో ముందుగానే తెలుసుకోండి.
ఈ క్రింది పట్టికలో కాలేజ్ కోడ్ కాలేజీ పేరు బ్రాంచ్ ర్యాంకు రేంజ్ వివరాలతో కూడినటువంటి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది.
TS ఎంసెట్ 2025: 20,000 నుండి 1,45,000 మధ్య Ranks వచ్చినవారికి ఈ కాలేజీలలో సీట్స్ వస్తాయి:
| కాలేజ్ కోడ్ | కాలేజీ పేరు | బ్రాంచ్ | opening rank | closing rank |
| JNTS | JNTUH CE సుల్తాన్పూర్ | CIVIL | 22,201 | 40,463 |
| BVRN | BVRIT నర్సాపూర్ | CIVIL | 22,237 | 82,075 |
| KITS | KITS వరంగల్ | CIVIL | 27,100 | 62,650 |
| KUCE | KU కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | CIVIL | 29,035 | 49,150 |
| GCTC | గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | CIVIL | 33,940 | 84,462 |
| VCEH | వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | CIVIL | 36,112 | 45,986 |
| BHCE | భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ | ECE | 4,853 | 68,622 |
| VBIT | VBIT ఘట్కేస్కార్ | ECE | 4,4431 | 50,437 |
| VJIT | VJIT హైదరాబాద్ | ECE | —- | 38,496 |
| MGIT | MGIT హైదరాబాద్ | CIVIL | —- | 1,06,992 |
| CVRH | CVR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | MECH | —– | 85,939 |
| IARE | IARE హైదరాబాద్ | CIVIL | 22,172 | 94,896 |
| AECM | AAR మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ | MECH | 30,000 | 80,000 |
| VJEC | విద్యా జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ | ECE | 35,000 | 1,20,000 |
ముఖ్యమైన సూచనలు :
- ఈ డేటా గత సంవత్సరాల opening ranks & closing ranks ఆధారంగా ప్రిపేర్ చేయడం జరిగింది.
- 2025 కౌన్సిలింగ్ సమయంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది
- CSE బ్రాంచ్ కు ఎక్కువ పోటీ ఉండటం వల్ల, 20,000 లోపు ర్యాంకు వచ్చిన వారికి మాత్రమే ఈ బ్రాంచ్ దక్కుతుంది.
- civil, mechanical, ECE వంటి బ్రాంచ్ లకు 80,000 నుండి 1,20,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి.
- ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు ఎక్కువ ఉంటుంది కావున, మీరు ఫీజు చెల్లించ గలిగే స్థోమత ఉన్నట్లయితేనే ఆ కాలేజీలను ఎంపిక చేసుకోండి.
అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు:
- అభ్యర్థులు కౌన్సిలింగ్ సమయంలో ఎక్కువ కాలేజీలను ఎంపిక చేసుకుని సబ్మిట్ చేయండి
- బ్రాంచ్ కన్నా కాలేజీ ప్రాధాన్యత అనేది మీ యొక్క ఆలోచనను బట్టి ఆధారపడి ఉంటుంది
- గత సంవత్సరాల రౌండ్ వన్ కౌన్సిలింగ్ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని వాటిని విశ్లేషించండి.
