TS POLYCET 2025 Counselling Schedule:
తెలంగాణ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఇది ఒక మంచి శుభవార్త. తెలంగాణలోని డిప్లమా కళాశాలలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న వారు, ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్లయితే, అధికారులు సర్టిఫికెట్ల పరిశ్రమలు చేసి విద్యార్థులకు సీట్ అల్లౌట్మెంట్ చేసి తరగతులను ప్రారంభించడం జరుగుతుంది. షెడ్యూల్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూసి తెలుసుకుందాం.
TS POLYCET 2025 1st Phase Counselling Schedule:
తెలంగాణ పాలిసెట్ మొదటి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ క్రింద విధంగా ఉంది.
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ డేట్స్ : జూన్ 24 నుండి 28 వరకు.
- దృవపత్రాల పరిశీలన తేదీ: జూన్ 26 నుండి 29 వరకు
- ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ నమోదు చేసే తేదీ : జూన్ 26 నుండి జూలై 1వ తేదీ వరకు
- ప్రొవిజినల్ సీట్ల అలాట్మెంట్ చేసే తేది : జూలై 15వ తేదీ
- ఫీజు చెల్లింపు మరియు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీ : జూలై 15 నుండి 16 వరకు
- కళాశాలలో రిపోర్టింగ్ ఇచ్చే తేదీ : జూలై 15 నుండి 17 వరకు
TS POLYCET 2025 2nd Phase Counselling Schedule:
తెలంగాణ పాలిసెట్ 2025 సెకండ్ పేజ్ షెడ్యూల్ ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల తేదీ
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ : జూలై 9 నుండి 10 వరకు
- సర్టిఫికెట్ల పరిశీలన తేదీ : జూలై 11వ తేదీ
- వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే తేదీ: జూలై 11 నుండి 12 వరకు
- ప్రొఫెషనల్ సీట్ల అలర్ట్మెంట్ తేదీ: జూలై 14వ తేదీ
- ఫీజు చెల్లింపు మరియు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీ : జూలై 14 నుండి 16వ తేదీ వరకు
TG POLYCET 2025 Spot Counselling Date:
- స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించే తేదీలు : జూలై 23 నుండి జూలై 30 వరకు
- ఈ స్పాట్ కౌన్సిలింగ్ సమయంలో కళాశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి సీట్లను నేరుగా కళాశాలల స్థాయిలో భర్తీ చేస్తారు.
Internal sliding schedule:
- సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ : జూలై 21 నుండి 22 వరకు
- సీట్లు పొందిన వారి జాబితా విడుదల తేదీ: జూలై 24న విడుదల
- తరగతులు ప్రారంభమయ్యేది : జూలై 18, 2025
సర్టిఫికెట్ల పరిశీలనకు కావలసిన డాక్యుమెంట్స్ :
- తెలంగాణ పాలిసెట్ 2025 హాల్ టికెట్ మరియు ర్యాంక్ కార్డ్ ఉండాలి
- పదవ తరగతి మార్క్స్ మెమో సర్టిఫికెట్
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రాలు
- నాలుగో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్
ముఖ్యమైన సూచనలు ఇవే :
- సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొరకు స్లాట్ బుకింగ్ తప్పనిసరి
- వెబ్ ఆప్షన్స్ రిజిస్ట్రేషన్ తర్వాత ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది
- సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మాత్రమే, కళాశాలలో రిపోర్ట్ చేయాలి
- ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అదనపు వెయిటేజ్ ఉండే అవకాశం ఉంది.
