TG ICET 2025:
తెలంగాణలో MBA, MCA వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించిన ఐసెట్ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీని జూన్ 21వ తేదీ ఉదయం విడుదల చేయనున్నారు. దాదాపుగా లక్ష మంది వరకు ఈ పరీక్ష రాయడం జరిగింది. రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహించారు. జూన్ 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు అబ్జెక్షన్ తీసుకొని, ఫైనల్ కీ మరియు ఫైనల్ రిజల్ట్స్ ని జూలై 7వ తేదీన విడుదల చేయనున్నట్లు గతంలోనే షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే పరీక్షలు పూర్తయి 10 రోజులు గడిచాయి. షెడ్యూల్ ప్రకారంగా జూన్ 21వ తేదీన ప్రాథమిక ఆన్సర్ కెళ్ళి విడుదల చేస్తారు. ఐసెట్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
TG ICET 2025 ఆన్సర్ కి, ఫైనల్ కి మరియు ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ?:
తెలంగాణ ఐసెట్ పరీక్షలకి సంబంధించి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడే షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. ఆ షెడ్యూల్స్ ప్రకారం ఫలితాలు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- ప్రాథమిక ఆన్సర్ కి విడుదల తేదీ :
- అబ్జెక్షన్స్ (అభ్యంతరాలు) సబ్మిట్ చేసే తేదీలు: జూన్ 22 నుండి 26వ తేదీ వరకు
- ఫైనల్ కీ విడుదల చేసే తేదీ : జులై 7, 2025
- ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేసే తేదీ : జూలై 7, 2025
ఫైనల్ కీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
తెలంగాణ ఐసెట్ 2025 పరీక్షలు రాసిన అభ్యర్థులు ప్రాథమిక ఆన్సర్ కిని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ
- ముందుగా TG ICET వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోమ్ పేజీలో “TG ICET 2025 Preliminary Answer Key” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులకు హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- వెంటనే మీకు ఆన్సర్ కి డౌన్లోడ్ అవుతుంది
- మీరు ఇచ్చిన ప్రశ్నలు, ఆన్సర్ కీ లో ఉన్న ప్రశ్నలు సరి చూసుకోండి.
- ఆన్సర్ కిలో ఏమైనా తప్పులు గమనించినట్లయితే వాటికి అభ్యంతరాలు సబ్మిట్ చేయండి
- మీకు మార్కులు కలిసే అవకాశం ఉంటుంది.
TG ICET 2025 official website.
FAQ’s:
1.తెలంగాణ ఐసెట్ 2025 పరీక్షల ప్రాథమిక కీ విడుదల తేదీ?
జూన్ 21వ తేదీ ఉదయం ప్రాథమిక కీ విడుదల చేస్తారు
2. తెలంగాణ ICET 2025 పరీక్షలు ఎప్పుడు నిర్వహించారు?
జూన్ 8 మరియు 9 తేదీలలో నిర్వహించారు.
3. దాదాపుగా ఎన్ని లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు?
80 వేలకు పైగా అభ్యర్థులు పరీక్ష రాయడం జరిగింది
