AP Thalliki Vandanam Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో ముఖ్యమైన తల్లికి వందనం పథకాన్ని జూన్ 12వ తేదీన అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే జూన్ 13వ తేదీ నుండి ఈరోజు వరకు చాలామంది లబ్ధిదారులకు ₹13,000/- డబ్బులు డిపాజిట్ అయ్యాయి. అయితే డబ్బులు డిపాజిట్ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో, ఆ దళితులకు ప్రభుత్వం మరొక అవకాశం కల్పిస్తూ జూన్ 20వ తేదీలోగా గ్రీవెన్స్ ( అభ్యంతరాల ) ఫారం సబ్మిట్ చేసేందుకు గడువు ఇచ్చింది. ఈ అభ్యంతరాల ఫారం సబ్మిట్ చేసిన తల్లుల అర్హతలను మళ్లీ చెక్ చేసి, వారి అకౌంట్లో 13000 డిపాజిట్ చేసే విధంగా కార్యాచరణ రూపొందించింది. అయితే డబ్బులు డిపాజిట్ కాని వారు గ్రీవెన్స్ ఫారం సబ్మిట్ చేయడానికి రేపు ఒక్క రోజే సమయం ఉంది కాబట్టి, త్వరితగతిన వారు ఫోరం సబ్మిట్ చేయాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది. లబ్ధిదారుల నుండి వచ్చిన గ్రీవెన్స్ ఫారాలని జూన్ 28వ తేదీ వరకు పరిశీలించి జూన్ 30వ తేదీన లబ్ధిదారుల జాబితా లిస్ట్ ని గ్రామ సచివాలయంలో ఉంచుతారు. ఆ లిస్టులో ఉన్న లబ్ధిదారులకు జూలై 5వ తేదీన ₹13,000 రూపాయలు అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు.
గ్రీవెన్స్ ఫారం సబ్మిట్ చేయడానికి రేపు ఒక్కరోజే సమయం:
తల్లికి వందనం డబ్బులు డిపాజిట్ కాని వారు గ్రీవెన్స్ అభ్యంతరాల ఫారంని గ్రామా లేదా వార్డు సచివాలయంలో జూన్ 20వ తేదీలోగా సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేసిన వారికి మాత్రమే డబ్బులు డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది.
అభ్యంతరాలు పరిశీలన మరియు లబ్ధిదారుల లిస్ట్:
- జూన్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు పెట్టుకున్న లబ్ధిదారుల గ్రీవెన్స్ ఫారాలని జూన్ 28వ తేదీ వరకు పరిశీలన చేస్తారు. గ్రామ సచివాలయంలోనే పరిశీలన జరుగుతుంది
- వారి యొక్క అభ్యర్థన నిజమైనట్లయితే, లబ్ధిదారులు నిజంగా అర్హులైనట్లయితే కొత్త లబ్ధిదారుల జాబితాని జూన్ 30వ తేదీన గ్రామ సచివాలయంలో ఉంచుతారు.
RTC లో 800 కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: click here
వీరికి డబ్బులు ఎప్పుడు డిపాజిట్ అవుతాయి?:
- జూన్ 30వ తేదీన గ్రామ సచివాలయంలో ఉంచిన లబ్ధిదారుల జాబితా లిస్టులో ఉన్న వారికి జూలై 5వ తేదీన వారి యొక్క తల్లుల బ్యాంకు ఖాతాలో ₹13 వేల రూపాయలు డిపాజిట్ కావడం జరుగుతుంది.
ఏపీ మెగా డీఎస్సీ ఆన్సర్ కి విడుదల : download
ముఖ్యమైన తేదీలు(Timeline):
| ముఖ్యమైన తేదీ | కార్యాచరణ |
| జూన్ 20 | అభ్యంతరాల స్వీకరణ ఆఖరి తేదీ |
| జూన్ 21-28 | అభ్యంతరాల పరిశీలన చేస్తారు |
| జూన్ 30 | లబ్ధిదారుల జాబితా విడుదల |
| జూలై 5 | ₹13,000/- డబ్బులు జమ |
ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి?:
- డబ్బులు రాలేని వారు
- అప్లికేషన్ పెట్టుకున్న లబ్ధిదారుల లిస్టులో పేరు లేని వారు
- అకౌంట్లో సమస్యల వల్ల డబ్బులు డిపాజిట్ కాని వారు.

గ్రీవెన్స్ ( అభ్యంతరాల) ఫారం ఎక్కడ సబ్మిట్ చేయాలి?:
లబ్ధిదారుల గ్రామంలోని గ్రామ సచివాలయంలో లేదా వార్డు సచివాలయంకి వెళ్లి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సమయంలో ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి.
ఈ పథకం ద్వారా వచ్చే రూ.13,000 మిస్సవకుండా చూడండి. ఇంకా ఫారం వేయకపోతే ఇవాళే సిద్దమవ్వండి. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.
