Breaking : AP EAMCET 2025 – Revised Ranks Released : Check Results @cets.apsche.ap.gov.in/EAPCET

AP EAMCET 2025:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాల్లో ఒక ముఖ్యమైనటువంటి మలుపు తీసుకుంది. ఇప్పటివరకు సుమారు 15 వేల మంది విద్యార్థులకు ర్యాంకులు కేటాయించలేదు. ఈ విషయానికి సంబంధించి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఈ విద్యార్థులకు సంబంధించిన ఎంసెట్ 2025 ఫలితాలను జూన్ 20వ తేదీలోగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా సమాచారం.

మళ్లీ ర్యాంకుల విడుదల ఎందుకు? ఎవరికోసం?:

కొంతమంది విద్యార్థులు 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన గాని, జూన్ 15వ తేదీ వరకు ఏపీ ఎంసెట్ కన్వీనర్ విధించిన ఆఖరి తేదీ నాటికి, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఇంటర్ బోర్డు విద్యార్థులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీ పరీక్షలు రాసి మళ్ళీ పాస్ అయినటువంటి విద్యార్థులు ఎంసెట్ వెబ్సైట్లో డిక్లరేషన్ ఫారంలో ఇంటర్ మార్కులను జూన్ 15వ తేదీ వరకు అప్లోడ్ చేశారు. వీరందరూ ఎంసెట్ పరీక్షలో క్వాలిఫై అయినా గానీ ర్యాంకులు రాలేదు. ఈ 15 వేల మంది ఎవరైతే ఉన్నారో వారందరికీ జూన్ 20వ తేదీలోగా మళ్లీ కొత్త ర్యాంకులు విడుదల ఎంసెట్ 2025 అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Join WhatsApp group

కొత్త ర్యాంకులను ఎప్పటిలోగా విడుదల చేస్తారు?:

జూన్ 15వ తేదీ నాటికి మార్కులను సబ్మిట్ చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్కులకు 25 శాతం వెయిటేజ్ మార్కులు కూడా కలిపి, ఎంసెట్లో వచ్చిన మార్కులకు అనుసంధానం చేసి జూన్ 20వ తేదీ నాటికి ఆ విద్యార్థులకు ర్యాంకులను విడుదల చేయడం జరుగుతుంది.

ఈ సందర్భంగా వారికి కూడా రివైజ్డ్ ర్యాంకులు కేటాయించే అవకాశం ఉంది. అప్పుడు ఆయ విద్యార్థులు కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ కు హాజరు కావడానికి అర్హులవుతారు.

ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో 1,45,000 ర్యాంకు వచ్చిన OC విద్యార్థులకు ఏ కాలేజీలలో ఏ బ్రాంచ్ వస్తుంది?

డిక్లరేషన్ ఫారం సబ్మిట్ చేసిన విద్యార్థులు ఏమి చేయాలి?:

  1. మీ ఇంటర్మీడియట్ మార్కుల సబ్మిట్ అయ్యాయా లేదా అనేది ఏపీ ఎంసెట్ కి సంబంధించిన వెబ్సైట్లో చెక్చేసుకోవాలి.
  2. జూన్ 20వ తేదీ తర్వాత ఫలితాలు వచ్చినప్పుడు మీ ర్యాంక్ ను చెక్ చేయండి
  3. కొత్తగా ర్యాంకు వచ్చినట్లయితే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కోసం సిద్ధమవ్వండి

RTC లో 800 కండక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ముఖ్య గమనిక:

ఇతర ఇంటర్మీడియట్ బోర్డులకు సంబంధించిన విద్యార్థులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు రాసి అందులో ఫెయిల్ అయ్యి మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాస్ అయిన విద్యార్థులు డిక్లరేషన్ ఫారం జూన్ 15వ తేదీ నాటికి ఇంటర్ మార్కులను అప్లోడ్ చేసే సబ్మిట్ చేయాలని కన్వీనర్ గతంలోనే తెలిపారు. సబ్మిట్ చేసిన వారి యొక్క కొత్త ర్యాంకులు త్వరలోనే విడుదల చేయనున్నారు.

రిజల్ట్స్ కచ్చితంగా జూన్ 20వ తేదీన విడుదల చేస్తారా అనేదానికి అధికారిక ప్రక్కన లేదు. ఈ తేదీ కేవలం ఊహాజనితమైనది మాత్రమే.