AP EAMCET 2025:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల అయ్యి ఇప్పటికి వారం రోజులు పైన కావస్తోంది. ఈ ఫలితాలలో చాలామంది ఓపెన్ కేటగిరి విద్యార్థులకు లక్షకు పైగా మరి ముఖ్యంగా 1,45,000 వరకు ర్యాంకులు వచ్చిన వారు ఉన్నారు. అయితే వారు ఓసి అభ్యర్థులైనందున ఏ కాలేజీలలో వారికి సీటు వస్తుందా రాదా అనేటువంటి సందేహం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎంసెట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఎక్కువగా ఉన్నందున, ఏ క్యాటగిరి వరకైనా ఎంత ఎక్కువ ర్యాంకు వచ్చినా కూడా ఏదో ఒక కళాశాలలో సీటు వచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. మీకు 1,45,000 ర్యాంక్ వచ్చి ఓసి అభ్యర్థులైనా కూడా చాలా మంచి కళాశాలలో మంచి సీట్స్ రావడం జరుగుతుంది.ఆ కాలేజీలు ఏమిటి, ఏ సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి, పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చదివి తెలుసుకుందాం.
1,45,000 ర్యాంకుతో OC విద్యార్థులకు వచ్చే టాప్ 10 కాలేజీలు మరియు బ్రాంచెస్ వివరాలు:
| College name | branch | Approx. Closing rank (OC) |
| Sir CR రెడ్డి కాలేజ్, ఏలూరు | EEE | 1,48,000 |
| నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు | CIVIL | 1,47,000 |
| బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ | MECHANICAL | 1,46,500 |
| SV కాలేజెస్ తిరుపతి | ECE (Min) | 1,48,000 |
| St. Ann’s కాలేజ్ చీరాల | CSE(Minority) | 1,49,000 |
| మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ | EEE | 1,45,500 |
| DNR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ భీమవరం | Food Tech | 1,47,500 |
| VVIT, గుంటూరు | Bio Tech | 1,45,800 |
| గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ | CIVIL | 1,46,000 |
| శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమలాపురం | ECE | 1,47,700 |
పైన తెలిపిన కాలేజీలు, బ్రాంచ్లు అలాగే అంచనా ర్యాంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ గత సంవత్సరాల్లో 2024, 23, 22 సంవత్సరాలలో ఆ ర్యాంకులతో సీడ్స్ పొందినటువంటి విద్యార్థుల డేటాని ఆధారంగా చేసుకుని చెప్పడం జరిగింది.
ఏపీ ఎంసెట్ 2025 మరొకసారి 2nd phase ఫలితాలు విడుదల
కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ జూన్ నెలాఖరులో విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల నుండి సర్టిఫికెట్ల పరిశీలన చేసి, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ తీసుకొని, వెబ్ ఆప్షన్స్ ఫైనలైజ్ చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ చేసి ఆగస్టు 14వ తేదీ లోపు క్లాసులను ప్రారంభించడం జరుగుతుంది.
ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభ తేదీ?:
ఆగస్టు 14వ తేదీలోగా ఇండియాలోని అన్ని ఇంజనీరింగ్ కళాశాలలో మరియు యూనివర్సిటీలో వారి యొక్క మొదటి సంవత్సర తరగతులను ప్రారంభించాలని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఇటీవల ప్రకటన జారీ చేసింది. దానికి అనుగుణంగా అన్ని కాలేజీలు ఆగస్టు 14వ తేదీ లోపు ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ని ప్రారంభించాలి.
