AP Aadabidda Nidhi Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో సూపర్ సెక్స్ పథకాల్లో ఒకటైనటువంటి ” ఆడబిడ్డ నిధి పథకం 2025″ కు సంబంధించి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 18 నుండి 59 సంవత్సరాలు మధ్య వయసున్న మహిళల అకౌంట్లో నెలకు ₹1500 రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లో డిపాజిట్ చేసి వారికి ఆర్థిక సహాయం చేసే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. అయితే ఈ పథకాన్ని P4 ద్వారా ( అనగా public, private, people, partnership) తో అనుసంధానం చేసి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. అయితే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు, అర్హతలు ఏమిటి, ఎప్పటినుండి అప్లై చేసుకోవాలనే పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆడబిడ్డ నిధి పథకం బడ్జెట్ కేటాయింపులు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించడానికి బడ్జెట్లో ఇప్పటికే 3300 కోట్ల రూపాయల కేటాయించడం జరిగింది. ఇది 2025 26 బడ్జెట్లో స్పష్టంగా పేర్కొనబడింది.
• P4 తో అనుసంధానం:
ఈ పథకంలో పారదర్శకత కోసం P4 (public, private, people, partnership) మోడల్ ను ఉపయోగించనున్నారు.
ఆడబిడ్డ నిధి పథకం : అర్హతల వివరాలు :
- దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ నివాసి అయ్యి ఉండాలి
- లబ్ధిదారు కచ్చితంగా మహిళ అయి ఉండాలి
- ఆ మహిళకు 18 నుండి 59 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి
- కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో అయితే 1.2 లక్షలు, అదే పట్టణంలో అయితే 1.8 లక్షలు పరిమితి కలిగి ఉండాలి.
- లబ్ధిదారుని కుటుంబం దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారై ఉండాలి
- ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఆదాయపు పన్ను చెల్లించేవారు అర్హులు కాదు
- తెల్ల రేషన్ కార్డ్,ఓటర్ కార్డ్,బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
తల్లికి వందనం పథకానికి అప్లై చేయడానికి ఆఖరి అవకాశం : కొత్త జాబితా : వారికి జూలై 5న డబ్బులు జమ
పథకం ప్రారంభం ఎప్పుడు?. ఎలా అప్లై చేసుకోవాలి?:
ప్రస్తుతం ప్రభుత్వం నుండి అధికారిక అప్లికేషన్ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల కాలేదు. అయితే జూలై నెలాఖరులోగా అప్లికేషన్ ప్రాసెస్ విండో ప్రారంభించే అవకాశం ఉంది. దరఖాస్తులను గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా లేదా నవ స్థాపితమైన ఆడబిడ్డ పోర్టల్ ద్వారా స్వీకరించే అవకాశం ఉంది.
ఏపీ తల్లికి వందనం డబ్బులు జమ కాలేదా?: ఫిర్యాదు ఫారం సబ్మిట్ చేయండి
అప్లికేషన్ కోసం ఉండవలసిన సర్టిఫికెట్స్:
అప్లికేషన్ కోసం ఈ దరఖాస్తులను ముందుగానే సిద్ధం చేసుకుని ఉండండి.
- ఆధార్ కార్డ్
- లబ్ధిదారుని ఓటర్ కార్డ్
- బ్యాంకు పాస్ పుస్తకం ఫోటో కాపీ
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
- ఇతర అవసరమైన సర్టిఫికెట్లు
ముఖ్యమైన సమాచారం:
- ఈ పథకం ఇంకా ప్రారంభించబడలేదు. ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తుంది
- ఈ పథకం యొక్క మొదటి విడత నిధుల విడుదల ఆగస్టు 2025 లో ఉండే అవకాశం ఉంది
- పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేయడానికి ప్రత్యేకమైన వెబ్సైట్ , మొబైల్ యాప్ ని రూపొందించనున్నారు.
- తప్పనిసరిగా లబ్ధిదారుని యొక్క బ్యాంకు ఖాతా ఆధార్ కార్డు తో లింక్ అయి ఉండాలి.
ఈ ఆడబిడ్డ నీది పథకానికి సంబంధించి అప్డేటెడ్ సమాచారం కోసం ఎప్పటికప్పుడు మా వెబ్సైట్ ని సందర్శిస్తూ ఉండండి
