Telangana rythu Bharosa scheme 2025:
తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసానిధులను ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. జూన్ 17వ తేదీ నుండి డబ్బులు జమ అవుతాయని ముందు చెప్పినప్పటికీ, ఈ రోజే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో జరిగిన రైతు సమ్మేళనం కార్యక్రమంలో ప్రసంగించిన అనంతరం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి 70,11,984 మంది రైతులకు వారి ఖాతాల్లోకి నిధులను విడుదల చేశారు. ఈ పథకానికి మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయల కేటాయించడం జరిగింది. అర్హులైన లబ్ధిదారులందరికీ వారం రోజుల్లో ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు వారి అకౌంట్లో డిపాజిట్ అవుతాయని ముఖ్యమంత్రి తెలిపారు.
ఎంత మొత్తం విడుదల చేశారు?:
• ఈసారి రైతు భరోసా కింద ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు: 9,000 కోట్లు. ఈ మొత్తం నిధులు 70,11,984 మంది రైతుల ఖాతాల్లోకి డిపాజిట్ కానున్నాయి. మొత్తం వారం రోజుల్లో ఈ డబ్బులన్నీ అర్హులైనటువంటి లబ్ధిదారుల అకౌంట్లోకి జమ కావడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
ఎవరికి లభించనుంది?:
- 70,11,984 మంది రైతుల అకౌంట్లోకి ఈ డబ్బులు జమ అవుతాయి
- 49 లక్షల పైగా ఎకరాలు ఉన్న రైతులకు ఈ రైతు భరోసా నిధులు జమ అవుతాయి.
- భూములపై రైతులకు హక్కు లేకపోయినా,అన్నదాతలకు ఈ డబ్బులు అందించనున్నారు.
- ఎలాంటి లబ్ధిదారుల జాబితా పరిశీలన లేకుండానే, సరైన నెంబర్, బ్యాంకు ఖాతా ఉన్నవారికి డైరెక్ట్ గా నిధులు జమవుతాయి.
తెలంగాణ రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితా విడుదల:Click Here
డబ్బులు డిపాజిట్ అయ్యాయో లేదో ఎలా చెక్ చేసుకోవాలి?:
రైతులు ఈ రైతు భరోసా పథకం కోసం ఇచ్చిన మొబైల్ నెంబర్ కు SMS వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ లో మొత్తం ఎంత డబ్బులు వారి యొక్క అకౌంట్లో డిపాజిట్ అయ్యాయో తెలుస్తుంది.లేదా రైతులు వారి యొక్క బ్యాంక్ app, UPI అకౌంట్స్ ద్వారా కూడా నిధులు జమ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు.
పోస్టల్ GDS 2025 రిజల్ట్స్ :AP, TS 4th మెరిట్ లిస్టు విడుదల చేశారు
ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు మొత్తం తొమ్మిది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతుల ఖాతాలోకి జమ అవుతాయని, వెంటనే డబ్బులు జమకాని రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదని, తొమ్మిది రోజులు ఈ ప్రక్రియ పూర్తవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటన చేశారు.
అధికారుల ప్రకటన:
వివిధ పద్ధతుల్లో ఈ డబ్బుల వితరణ చేస్తామని, ఎమ్మెల్యేలు ఎంపీలు మరియు అధికారులు రైతులకు ఈ రైతు భరోసా పథకం నిధులు విడుదలకు సంబంధించిన వివరాలను రైతులకు వివరించాల్సిన అవసరం ఉందని, వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. వచ్చే రోజుల్లో మిగిలిన రైతులకు కూడా ఈ డబ్బులు జమవుతాయని అధికారులకు వివరించడం జరిగింది.
