సూపర్ అప్డేట్: ఏపీ తల్లికి వందనం పధకం 2025 స్టేటస్ ని మీ వాట్సాప్ లోనే చెక్ చేసుకోవచ్చు: వెంటనే మీరు అర్హులా కాదా చెక్ చేసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకం 2025 స్టేటస్ చెక్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సూపర్ అప్డేట్ తీసుకొచ్చింది. లబ్ధిదారులు వారి యొక్క మొబైల్ లోని వాట్సాప్ ద్వారానే స్టేటస్ చెక్ చేసుకొని వాళ్ళు ఈ పథకానికి అర్హులా కాదా అనేది చూసుకునే విధంగా ఏపీ మనమిత్ర యాప్ లో చాలా మంచి సౌకర్యం కల్పిస్తోంది. ఈ తల్లికి వందనం పధకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని స్కూలుకి వెళ్లే పిల్లలకు తల్లులకు 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు జూన్ 12వ తేదీన ప్రారంభించడం జరిగింది. వాట్సాప్ లో మీరు మీ యొక్క స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

What’s App లో తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?:

Join Whats App Group

  • ముందుగా ఏపీ మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ నంబర్ +9195523 00009 ను మీ మొబైల్లో సేవ్ చేసుకొని, HI అని మెసేజ్ పెట్టండి.
  • వెంటనే మీకు “Choose Services” ఆప్షన్ ఉన్న మెసేజ్ వస్తుంది. అది క్లిక్ చేయండి
  • వెంటనే “Citizen Services” ఆప్షన్ ని ఎంపిక చేయండి.
  • అక్కడ “Thalliki Vandanam” ఆప్షన్ ఉంటుంది. అది ఎంపిక చేసుకోండి.
  • లబ్ధిదారుని ” Aadhar card number” ఎంటర్ చేయండి.
  • సబ్మిట్ చేసిన తర్వాత మీ స్టేటస్ చూపిస్తుంది. అప్పుడు eligible/ ineligible, amount credited /not credited వివరాలు చూపిస్తాయి.
  • ఈ విధంగా మీ యొక్క తల్లికి వందనం పథకం 2025 కి సంబంధించిన స్టేటస్ ని వాట్సాప్ ద్వారానే చెక్ చేసుకోవచ్చు.

తల్లికి వందనం పథకం కొత్త లిస్టు విడుదల : మీ పేరు చూసుకోండి : వీరికి జూలైలో డబ్బులు జమ

Ineligible అని వచ్చిన వారు ఏం చేయాలి?:

  • మీకు అన్ని అర్హతలు ఉన్నా కూడా ineligible అని వస్తే మీ వివరాలు పొరపాట్లు ఉన్నాయని అర్థం.
  • అలా పొరపాట్లు ఉన్నవారు దగ్గరలోని గ్రామ సచివాలయంకి వెళ్లి సరిదిద్దుకోవాలి
  • అనంతరం మీరు మళ్ళీ అప్లై చేసే అవకాశం ఉంటుంది

తల్లికి వందనం పథకం 2025 కి కొత్తగా ఎలా అప్లై చేయాలి?:

  1. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కొత్తగా మీరు అప్లికేషన్ ఫారం పూరించాల్సిన అవసరం లేదు
  2. విద్యా సంస్థల ద్వారా విద్యార్థుల జాబితా సిద్ధమవుతుంది.
  3. తల్లి యొక్క బ్యాంకు ఖాతా వివరాలు,ఆధార్ కార్డు వివరాలు, మరియు విద్యార్థి అడ్మిషన్ డేటాను స్కూల్ హెడ్మాస్టర్ ద్వారా గాని లేదా గ్రామ సచివాలయం ద్వారా నమోదు చేసుకోవాలి.

ఏపీ పాలీసెట్ 2025 మొదటి విడత కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల

అప్లికేషన్ లేదా డేటా సబ్మిట్ చేసుకోవడానికి చివరి తేదీ?:

జూన్ 20వ తేదీ నాటికి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు, దగ్గర్లోని గ్రామ సచివాలయానికి వెళ్లి మీ యొక్క కొత్త దరఖాస్తు ఫారం చేయండి.

ఈ పథకం కింద ఎంత నగదు చెల్లిస్తారు?:

ఈ పథకానికి అర్హులైనటువంటి తల్లులకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ప్రతి పిల్లవాడికి 13 వేల రూపాయలు చొప్పున తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ లో నగదు డిపాజిట్ చేయడం జరుగుతుంది.

ముఖ్యమైనవి వివరాలు:

  • Status Check కోసం కచ్చితంగా తల్లి యొక్క ఆధార్ కార్డు నెంబర్ కరెక్ట్ గా సబ్మిట్ చేయాలి
  • వాట్సాప్ మన మిత్ర సర్వీసెస్ ద్వారా తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవడం చాలా వేగంగా, సులభంగా జరుగుతుంది.
  • అర్హత కలిగిన వారు వారి యొక్క అకౌంట్లో డబ్బులు డిపాజిట్ అయిన తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా వివరాలను చూసుకోవచ్చు.