Breaking: తల్లికి వందనం పథకం 2025 కొత్త లిస్టు విడుదల- వారికి జూలైలో డబ్బులు జమ : NPCI తప్పులు వల్ల డబ్బులు రాలేదా?- అయితే ఎలా చేయండి

AP Thalliki Vandanam Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12వ తేదీన ప్రవేశపెట్టిన తల్లికి వందన పథకం ద్వారా పిల్లలను స్కూల్ కి పంపుతున్నటువంటి తల్లులను ప్రోత్సహించడానికి ₹13,000/- ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే నిన్నటి నుంచి చాలామంది తల్లిల ఖాతాలో డబ్బులు జమ అయిన విషయం తెలిసిందే. తాజాగా కొంతమంది పేర్లు ఫైనల్ లిస్టులో ఉండి కూడా డబ్బులు జమ కాలేదని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎవరికీ జూలై నెలలో డబ్బులు జమవుతాయి?:

  • ఈ విద్యా సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ లో అడ్మిషన్ తీసుకున్న చిన్న పిల్లలకు
  • పదో తరగతి పాస్ అయ్యి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు

జూలై నెల 5వ తేదీ నాటికి డిపాజిట్ అవుతాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అలాగే వీటికి సంబంధించి కొన్ని కొత్త లిస్టులు కూడా విడుదలవుతున్నాయని సమాచారం.

Join WhatsApp group

ఎవరి ఖాతాలో డబ్బులు జమ కావడం లేదు?. దానికి గల కారణాలు ఏమిటి?:

అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నా కూడా డబ్బులు జమ కాలేదా అయితే దీనికి NPCI Mapping చేయకపోవడమే అసలైన కారణంగా తెలుస్తోంది.

•NPCI Active / Inactive అంటే ఏమిటి?:

  • Active అనగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ UPI/AEPS కు అనుసంధానమై ఉంది అని అర్థం.
  • Inactive లో ఉంటే మీకు ప్రభుత్వ నిధులు మీ ఖాతాలో జమ కావు.

తల్లికి వందనం పధకం డబ్బులు రావాలి అంటే ఇవి కచ్చితంగా ఆక్టివేట్ చేయించండి: Click Here

NPCI Active ఎలా చేయించుకోవాలి?:

  1. మీరు ఏ బ్యాంకులో అయితే ఎకౌంటు ఓపెన్ చేసి తల్లికి వందనం పథకానికి సబ్మిట్ చేశారో, ఆ బ్యాంకు కి ఒకసారి వెళ్లి,
  2. Aadhaar Seeding మరియు NPCI Mapping చేయమని చెప్పండి.
  3. రెండు నుండి మూడు రోజుల్లో గా NPCI Active అవుతుంది.
  4. అప్పుడు మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు కాబట్టి, మీకు వెంటనే డబ్బులు జమ కావడం జరుగుతుంది.

ఏపీ తల్లికి వందనం పథకం Eligible & Ineligible లిస్ట్ : Click Here

కొత్తగా వచ్చిన లిస్టులో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి?:

  1. గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ ని మీరు సంప్రదించినట్లయితే వారు కొత్తగా వచ్చిన లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసి చెప్తారు.
  2. లేదంటే గ్రామ సచివాలయంలో అర్హుల జాబితా లిస్టు గోడమీద అంటించి ఉంటుంది. అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.
  3. స్టూడెంట్ ఐడి, మీ పేరుతో నమోదు అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు

కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎలా?:

  • కొత్తగా తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునేటువంటివారు, గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు ఫారం నింపి సబ్మిట్ చేయాలి.
  • అప్లై చేసేటప్పుడు: విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, తల్లి ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, విద్యార్థి యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ లిస్ట్ సబ్మిట్ చేయాలి.

మీకు డబ్బులు డిపాజిట్ అయ్యాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలి:

  1. మీ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ అయినట్లయితే మీకు SMS వస్తుంది.
  2. UPI/AEPS app ద్వారా మినీ స్టేట్మెంట్ చెక్ చేయండి.

ఫైనల్ లిస్ట్ లో మీ పేరు ఉందా?:

నిన్న, ఈరోజు విడుదలైన కొత్త లిస్టులో కొంతమంది విద్యార్థులకు ₹13,000/- Active అని ఉంది. కానీ Inactive అని ఉన్న వారికి మాత్రం డబ్బులు జమకాలేదు. మీరు పైన చెప్పిన విధంగాNPCI Active చేయించుకుంటే మళ్ళీ మీ అకౌంట్లో డబ్బులు జమ కావడం జరుగుతుంది.

ఇది అందరికీ ఉపయోగపడేటువంటి సమాచారం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి.