AP Police 2025 first phase web counselling notification:
ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ 2025 (AP POLYCET 2025) ఎంట్రన్స్ రాత పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం మొదటి దశ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు ఫీజు చెల్లింపు,విద్యార్థుల నుండి సర్టిఫికెట్ల పరిశీలన, ఆప్షన్స్ ఎక్సర్సైజ్ పలు ప్రక్రియలు ఉంటాయి. మొదటి దశ వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
ఈ కౌన్సిలింగ్ కి ఎవరు అప్లై చేసుకోవాలి?:
- ఏపీ పాలీసెట్ 2025లో ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు
- ఆంధ్రప్రదేశ్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా ప్రవేశాలు పొందాలి అంటే, తప్పనిసరిగా ఈ కౌన్సిలింగ్ అవసరం.

కౌన్సిలింగ్ కు కావాల్సిన సర్టిఫికెట్స్:
- ఏపీ పాలీసెట్ ర్యాంక్ కార్డ్ మరియు హాల్ టికెట్
- SSC/10th మార్క్స్ మేము ఉండాలి.
- TC ( ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ )
- విద్యార్థి యొక్క birth సర్టిఫికెట్
- SC, ST, NC, EWS అభ్యర్థుల యొక్క కుల దృవీకరణ పత్రాలు
- ఇటీవల తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికెట్
- ఆధార్ కార్డ్
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్
- రెసిడెన్స్ సర్టిఫికెట్
- EWS సర్టిఫికెట్.
ఏపీ తల్లికి వందనం పథకం స్టేటస్ చెక్, కొత్తగా అప్లై చేసుకునే విధానం
వెబ్ కౌన్సిలింగ్ మొత్తం ఎన్ని దశలు ఉంటుంది:
- ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు : ఏపీ పాలీసెట్ వెబ్సైట్లో లాగిన్ అయి ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి.
- సర్టిఫికెట్ల పరిశీలన : ఏపీ పాలిసెట్ హెల్ప్ లైన్ సెంటర్లలో ఒరిజినల్ సర్టిఫికెట్లను చూయించి వెరిఫికేషన్ చేయించుకోవాలి.
- ఆప్షన్ల ఎక్సర్సైజ్ : కోరుకున్న డిప్లొమా కాలేజీలు, కోర్సులకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్స్ ఇవ్వాలి
- సీట్ అలాట్మెంట్ : ఏపీ పాలీసెట్ అధికారికి వెబ్సైట్ ద్వారా సీట్ అల్లౌట్మెంట్ వివరాలు తెలుసుకోవచ్చు.
ఏపీ ఎంసెట్ 2025 Rank vs Colleges List
కౌన్సిలింగ్ ముఖ్యమైన తేదీలు :
| అంశము | ముఖ్యమైన తేదీలు |
| ఏపీ పాలీసెట్ కౌన్సిలింగ్ ప్రారంభ తేదీ | 20th జూన్ 2025 |
| దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ | 1st జూలై 2025 |
| సీట్ అలాట్మెంట్ | అధికారిక వెబ్సైట్ ద్వారా త్వరలో వెల్లడిస్తారు |
ఏపీ పాలీసెట్ అధికారిక వెబ్సైట్ లింక్ : https://polycet.ap.gov.in
ముఖ్యమైన సూచనలు:
- ఏపీ పాలీసెట్ అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి
- కావలసిన అన్ని సర్టిఫికెట్లను ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలతో సిద్ధంగా ఉంచుకోవాలి
- ఫీజు చెల్లింపు మరియు ఆప్షన్ల గడువు మిస్ అవ్వకుండా గడువులోగా చెల్లించాలి.
