AP Thalliki Vandanam Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా ₹15000/- అందిస్తామని ప్రకటించిన కూడా ఈ రోజు పథకం ప్రారంభించే సమయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతి తల్లి అకౌంట్లో 13000 మాత్రమే జమ చేయడం జరుగుతుంది అని మీడియా ముఖంగా తెలిపారు. అయితే 15000 ఇవ్వకుండా 13000 మాత్రమే ఇస్తూ 2000 కట్ చేయడం వెనుక కారణం ఏమిటో తెలుసుకోవాలని చాలామంది మహిళలు అనుకుంటున్నారు. ఈ 2000 రూపాయలు కట్ చేయడానికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వం నోటీస్ కూడా విడుదల చేసింది. ఈ 2000 ఎందుకు కట్ చేస్తున్నారు, ఈ పథకానికి అర్హత కలిగినటువంటి వారు వారి యొక్క స్టేటస్ ఏ విధంగా చూసుకోవాలి, కొత్తవారు ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
₹15,000/- లలో ₹2,000/- ఎందుకు కట్ చేస్తున్నారు?:
తల్లికి వందనం పథకంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక నోటీసు ప్రకారం, ప్రతి అర్హులైన విద్యార్థిపై ₹2,000/- లబ్ధిదారుని వద్దనుండి మినహాయించి, పాఠశాల లేదా జూనియర్ కాలేజీ మరుగుదొడ్ల నిర్వహణకు, ఇతర సౌకర్యాలను కల్పించడానికి ఉపయోగించినట్లు తెలిపారు. అందువల్ల తల్లికి వందనం కింద చెల్లించాల్సిన ₹15,000 రూపాయల్లో ₹2000 రూపాయలు కట్ చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలపడం జరిగింది.

- ఇది తల్లికి ఇవ్వబడే మొత్తంలో నుంచి మినహాయిస్తారు
- ఈ 2000 జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న ఖాతాలో జమ చేస్తారు
- ఈ డబ్బులను స్కూల్ మెయింటెనెన్స్, శుభ్రత మరియు ఇతర అవసరాల కోసం ఖర్చు చేయడం జరుగుతుంది.
- అంటే ప్రతి తల్లి ఖాతాలో ₹13,000 రూపాయలు మాత్రమే జమ కావడం జరుగుతుంది.
డబ్బులు జమ అయ్యాయా లేదా ఇలా చెక్ చేసుకోండి?:
లబ్ధిదారులు ఈ పథకం కింద డబ్బులు అందుకున్నారా లేదా అనేది తెలియాలి అంటే ఈ క్రింది విధంగా చెక్ చేయండి.
తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయా లేదా స్టేటస్ చెక్ చేసుకోండి
- లబ్ధిదారుని యొక్క బ్యాంకు ఖాతా మినీ స్టేట్మెంట్ తీసుకోండి.
- https://apcfss.in/ వంటి అధికారికి వెబ్సైట్లో గానీ లేదా గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించండి.
- విద్యార్థి వివరాల ఆధారంగా బెనిఫిషియరీ డీటెయిల్స్ ని చెక్ చేయవచ్చు.
అర్హత ఉన్నవారు ఎలా అప్లై చేయాలి?:
ఈ పథకానికి మీరు అర్హులైనట్లయితే ఈ క్రింది విధంగా దరఖాస్తులు చేసుకోండి.
- మీ గ్రామంలోని గ్రామ వార్డు సచివాలయం లేదా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ (MEO) నీ సంప్రదించండి
- ఈ క్రింది సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయండి :
- విద్యార్థి ఆధార్ కార్డ్
- తల్లి యొక్క ఆధార్ కార్డు
- విద్యార్థి యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్
- బ్యాంకు ఖాతా నెంబర్ ఇవ్వాలి.
- అప్లికేషన్ ఫారం పూర్తి చేసి, అవసరమైన సర్టిఫికెట్స్ జోడించి సబ్మిట్ చేయాలి.
తల్లికి వందనం పథకానికి కొత్తవారు ఇలా అప్లై చేయండి
తల్లికి వందనం పథకం ముఖ్యాంశాలు ఇవే:
| అంశము | వివరాలు |
| మొత్తం చెల్లించాల్సిన రుసుము | ₹15,000/- |
| తల్లి ఖాతాలో జమ అయ్యే మొత్తం | ₹13,000/- |
| మిగిలిన ₹2,000 వినియోగం | స్కూల్ డెవలప్మెంట్ ( collector control fund ) |
| ప్రయోజనం | తల్లులను ప్రోత్సహించి పిల్లలను విద్యలో భాగస్వామ్యం చేయడం |
| అధికారిక వెబ్సైట్ | https://apcfss.in/ |
ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ని సందర్శించండి.
