AP Thalliki Vandanam Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకాన్ని (Thalliki Vandanam Scheme 2025) జూన్ 12వ తేదీన అట్టహాసంగా ప్రారంభించారు. సూపర్ సెక్స్ పథకాల్లో ముఖ్యమైనటువంటి పథకం తల్లికి వందనం పథకం. ఈ పథకం ద్వారా స్కూలుకి వెళ్లే పిల్లల తల్లులకు సంవత్సరానికి ₹15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి, పిల్లల చదువులకు సహాయ పడడం కోసం ఈ పథకాన్ని మొదటిసారిగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ₹15,000/- నేరుగా తల్లి యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరిగింది. అయితే ఆ పథకం డబ్బులు తల్లుల ఖాతాలో డిపాజిట్ అయ్యాయా లేదా అనే దానికి సంబంధించిన స్టేటస్ ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా ఇప్పుడు చూద్దాం. డబ్బులు రాని వారు ఏ విధంగా కొత్తగా అప్లై చేయాలో కూడా తెలుసుకుందాం.
ఈ ఆర్టికల్ ద్వారా మీరు తెలుసుకునే అంశాలు:
- తల్లికి వందనం పధకం (Thalliki Vandanam Scheme 2025) డబ్బులు అకౌంట్ లోకి డిపాజిట్ అయ్యాయా లేదా అని స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి.
- డబ్బులు రాకపోవడానికి కారణాలు ఏమిటి?
- కొత్తగా ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- పథకానికి కావాల్సిన అర్హతలు మరియు సర్టిఫికెట్ల వివరాలు.
డబ్బులు వచ్చాయా లేదా స్టేటస్ ఎలా చెక్ చేయాలి?:
తల్లికి వందనం పథకం లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక beneficiary status check portal ను అందించనుంది. (Example: https://gsws-nbm.ap.gov.in ). ఇక్కడ మీరు ఈ క్రింది విధంగా చెక్ చేయవచ్చు.
- స్టెప్ 1: ముందుగా అధికారిక వెబ్సైట్ https://gsws-nbm.ap.gov.in లోకి వెళ్ళండి.
- స్టెప్ 2: know your payment status లేదా Scheme payments ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- స్టెప్ 3: మీ యొక్క ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి
- స్టెప్ 4: Submit పై క్లిక్ చేసిన వెంటనే, మీ అకౌంట్ లోకి పథకం డబ్బులు జమయ్యాయా లేదా అన్నది తెలుస్తుంది.
- Bank Account లేదా Aadhar Linked మొబైల్ నెంబర్ కు ఎస్ఎంఎస్ కూడా వస్తుంది.
డబ్బులు రాలేదు అంటే?:
ఏపీ తల్లికి వందనం పథకానికి కొత్తవారు ఇలా అప్లై చేయండి
మీకు ఈ తల్లికి వందనం పథకం డబ్బులు రాలేదు అంటే ఈ క్రింది కారణాలు అయి ఉండవచ్చు.
- రేషన్ కార్డులో మీ పేరు లేకపోవడం వల్ల
- భారత సర్టిఫికెట్ లేదా ఇమ్యునైజేషన్ రికార్డ్ అప్లోడ్ చేయకపోవడం.
- బ్యాంక్ ఎకౌంటు ఆధార్ కి లింక్ చేయకపోవడం.
- మీ గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా నిర్ధారణ కాకపోవడం.
ఈ సమస్యల్ని పరిష్కరించాలి అంటే మీ గ్రామ,వార్డు సచివాలయ అధికారిని సంప్రదించగలరు.
కొత్తగా ఎలా అప్లై చేయాలి?:
2025 నుండి నూతన దరఖాస్తుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం NBM పోర్టల్ ద్వారా అప్లికేషన్స్ తీసుకుంటుంది.
- ముందుగా https://gsws-nbm.ap.gov.in ఓపెన్ చేయండి
- ” Apply For Thalliki Vandanam scheme 2025” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- లబ్ధిదారుని యొక్క ఆధార్, పిల్లల వివరాలు, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలను నింపండి
- అన్ని సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి
- స్టేటస్ ని మీ యొక్క మొబైల్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు
అర్హతలు మరియు అవసరమైన డాక్యుమెంట్స్ :
తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి క్రింది అర్హతలు మరియు సర్టిఫికెట్స్ కావాలి.
తల్లికి వందనం పధకం డబ్బులు డిపాజిట్ అయ్యాయి ఇలా చెక్ చేసుకోండి
- పథకం యొక్క లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ నివాసి అయ్యి ఉండాలి
- పిల్లలు స్కూల్ కి వెళ్తున్న పిల్లలు అయి ఉండాలి
- తల్లి మరియు పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డు ఉండాలి
- బ్యాంకు ఖాతా ఉండాలి. ఆ ఖాతాకు కచ్చితంగా ఆధార్ లింక్ అయి ఉండాలి.
- ఇమ్యునైజేషన్ రికార్డు కలిగి ఉండాలి
- పిల్లల బర్త్ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
- రేషన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
- బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తల్లి పేరిట ఉండాలి
ముఖ్యమైన సూచనలు :
- పథకం వర్తింపు తేదీ : జూన్ 12, 2025
- పొందే సహాయం : ప్రతి బిడ్డకు 15 వేల రూపాయలు సంవత్సరానికి.
- ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో మరి కళాశాలలో చదువుతున్న ఫస్ట్ క్లాస్ నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు అర్హులు.
పైన తెలిపిన విధంగా మీ స్టేటస్ చెక్ చేసుకుని, కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు వెంటనే అప్లై చేయండి
