TS TET 2025 Hall Tickets Released : Download @tgtet.aptonline.in/tgtet

TS TET 2025 Exams

తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 పరీక్షలను జూన్ 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు, రోజుకి రెండు షిఫ్టుల వారిగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ తెలంగాణ టెట్ రాత పరీక్షకు 1.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. తెలంగాణ టెట్ 2025 హాల్ టికెట్స్ జూన్ 9వ తేదీ నుండి డౌన్లోడ్ చేసుకునే విధంగా వెబ్సైట్లో లింక్ ఆక్టివేట్ చేయడం జరిగింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకొని,అందులో ఇచ్చిన సమాచారం ఆధారంగా పరీక్ష సెంటర్ కి వెళ్లి, రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ స్టేట్ 2025 పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ టెట్ 2025 హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

తెలంగాణ 2025 హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.

Join Whats App Group

  1. ముందుగా తెలంగాణ టెట్ 2025 అధికారిక వెబ్సైట్ https://tgtet.aptonline.in/tgtet/ ఓపెన్ చేయండి.
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో “TS TET 2025 Hall Tickets Download” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. అభ్యర్థుల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే హాల్ టికెట్ స్క్రీన్ పైన డౌన్లోడ్ అవుతుంది.
  5. అది ప్రింట్ అవుట్ తీసుకోండి.

తెలంగాణ టెట్ 2025 పరీక్షల షెడ్యూల్: Download

తెలంగాణ టెట్ 2025 పరీక్షల షెడ్యూల్:

రోజుకి రెండు షిఫ్టుల వారీగా తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 పరీక్షలను నిర్వహించనున్నారు. జూన్ 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:3 0 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని నిబంధనలో తెలిపారు. ఆలస్యంగా వచ్చిన వారిని లోనికి అనుమతించబోరు. కావున అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునే ఏర్పాటు చేసుకోండి.

TS TET 2025 Hall Tickets: Download

తెలంగాణ టెట్ రాత పరీక్షల అర్హత సాధించిన వారికి 20% వెయిటేజ్ మార్కులను డీఎస్సీ పరీక్షలోకలుపుతారు. కావున డీఎస్సీలో మంచి ర్యాంకు వచ్చి టీచర్ ఉద్యోగం పొందాలి అంటే, తెలంగాణ టెట్ రాత పరీక్ష ఎంతో కీలకమైనది. కావున పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ చేసే విధంగా పరీక్ష రాయవలెను.