TG TET 2025 Exams:
తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET 2025) పరీక్షల హాల్ టికెట్స్ ఈరోజు విడుదల అవ్వాల్సి ఉండగా, హాల్ టికెట్స్ విడుదలని 11వ తేదీకి పోస్ట్ పోన్ చేస్తూ తెలంగాణ విద్యాశాఖ ప్రకటన జారీ చేయడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని విద్యాశాఖ తెలిపింది. జూన్ 18 నుండి జూన్ 30వ తేదీ వరకు రోజుకి రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 1.5 లక్షల మంది అభ్యర్థులు తెలంగాణ టెట్ పరీక్షకి అప్లికేషన్స్ సబ్మిట్ చేశారు. 12 రోజుల పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ని కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. దానికి అనుగుణంగానే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అందులో ఎటువంటి మార్పు ఉండదని తెలిపింది. తెలంగాణ టెట్ హాల్ టికెట్స్ విడుదల కొత్త తేదీతో పాటు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ టెట్ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల పోస్ట్ పోన్ చేశారు:
తెలంగాణ టెట్ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు జూన్ 9వ తేదీన హాల్ టికెట్స్ విడుదల చేయాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక సమస్యల కారణం వల్ల టెట్ హాల్ టికెట్స్ విడుదల తేదీని జూన్ 11వ తేదీకి విద్యాశాఖ వాయిదా వేయడం జరిగింది. కావున అభ్యర్థులు జూన్ 11వ తేదీ ఉదయం 9 గంటల నుంచి హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ టెట్ హాల్ టికెట్స్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి?:
టెట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి
తెలంగాణ స్కూల్స్ రీఓపెన్ డేట్ :2025-26 విద్యా సంవత్సర క్యాలెండర్
- ముందుగా అభ్యర్థులు తెలంగాణ టెట్ అధికారిక వెబ్సైట్ https://tgtet.aptonline.in/tgtet/ ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోమ్ పేజీలో “TG TET June 2025 hall tickets” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- అభ్యర్థుల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి.
- వాటిని ప్రింట్ అవుట్ తీసుకోండి
FAQ’s:
1. తెలంగాణ టెట్ హాల్ టికెట్స్ విడుదలయ్యే తేదీ?:
జూన్ 11వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు.
2. తెలంగాణ టెట్ 2025 పరీక్షలకు మొత్తం ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారు?.
దాదాపుగా 1.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది
