AP EAMCET 2025 Counselling Expected Date: Required Certificates List

AP EAMCET 2025 Counselling Expected Date:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్షల ఫలితాలను జూన్ 8వ తేదీ సాయంత్రం 5:30 నిమిషాలకు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు కౌన్సిలింగ్ నిర్వహణపై దృష్టి పెట్టారు.అయితే అంచనా ప్రకారం ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ జూలై మొదటి వారంలో ప్రారంభం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్ ద్వారా మీరు తెలుసుకునేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు:

  • కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది.
  • దశలవారీగా కౌన్సిలింగ్ ప్రాసెస్
  • అవసరమైన డాక్యుమెంట్స్ లిస్ట్
  • హెల్ప్ లైన్ సెంటర్లు, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ డేట్స్
  • ముఖ్యమైన వెబ్సైట్స్ మరియు సూచనలు

AP EAMCET 2025 counselling expected date:

ఏపీ ఎంసెట్ ఉండలు 25 కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రతిసారి ఫలితాలు విడుదలైన మూడు నుండి నాలుగు వారాల తర్వాత ప్రారంభమవుతుంది. ఇప్పుడు కూడా జూలై మొదటి వారంలో అనగా జూలై 3 నుండి ప్రారంభం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

APSCHE అధికారిక వెబ్సైట్ ద్వారా మీకు కౌన్సిలింగ్ తేదీలను ప్రకటిస్తారు.

Join Whats App Group

AP EAMCET 2025 counselling process: complete stages:

కౌన్సిలింగ్ మొత్తం ఈ క్రింది దశలవారీగా జరుగుతుంది.

ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో ఎంత తక్కువ ర్యాంకు వచ్చినా ఈ కాలేజీలో మంచి సీటు వస్తుంది

  1. ముందుగా అధికారిక కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు
  2. విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు చెల్లించడానికి అవకాశం ఇస్తారు
  3. హెల్ప్ లైన్ సెంటర్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు
  4. కోర్సులు లేదా కళాశాలల ఎంపిక చేస్తారు
  5. సీటు కేటాయింపు చేస్తారు
  6. ఇంకా చివరిగా ఎంపికైన కాలేజీకి వెళ్లి జాయిన్ అవ్వడమే.

కౌన్సిలింగ్ కోసం సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికెట్ల జాబితా వివరాలు:

ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ మీరు పైన పేర్కొన్న దశల వారిగా పాల్గొనాలంటే, ఈ క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

  1. ఏపీ ఎంసెట్ 2025 ర్యాంక్ కార్డ్
  2. ఏపీ ఎంసెట్ హాల్ టికెట్
  3. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
  4. పదవ తరగతి మార్క్స్ మెమో
  5. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్
  6. స్టడీ సర్టిఫికెట్స్ 6 నుండి 12వ తరగతి వరకు
  7. ఇన్కమ్ సర్టిఫికెట్
  8. రెసిడెన్సి సర్టిఫికెట్
  9. ఆధార్ లేదా కమ్యూనిటీ సర్టిఫికెట్
  10. EWS/OBC/SC/ST/PWD సర్టిఫికెట్
  11. లోకల్ స్టేటస్ సర్టిఫికెట్

పైన తెలిపిన అన్ని సర్టిఫికెట్లు ఒరిజినల్ కాపీలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్లాలి.

తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ మరియు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభ తేదీ

Web options and seat allotment:

ర్యాంక్ ఆధారంగా వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది

ఒకటికంటే ఎక్కువ కాలేజీలో మరియు కోర్సులు ఎంపిక చేసుకోవచ్చు

సీట్ అలాట్మెంట్ తర్వాత మీకు వచ్చినటువంటి కాలేజీలో జాయిన్ అవ్వాలి లేదా రెండవ రౌండ్ కోసం వెయిట్ చేయొచ్చు

కౌన్సిలింగ్ ఫీస్:

వివరాలు అధికారికంగా విడుదల చేయలేదు, కావున మనం ఇప్పుడే కౌన్సిలింగ్ ఫీజు ఎంత ఉంటుందో చెప్పలేము.

ముఖ్యమైన వెబ్సైట్స్ మరియు సూచనలు:

ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మరియు అడ్మిషన్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం కోసం అధికార వెబ్సైట్ ని ప్రతిరోజు ఓపెన్ చేసి చెక్ చేయండి.

మీకు ర్యాంకు ఎక్కువ వచ్చినా లేదా తక్కువ వచ్చిన చాలా మంచి కాలేజీలోనే సీట్ వచ్చే విధంగా ముందుగానే మీరు దానికి సంబంధించి అన్ని విధాలుగా ప్రిపేర్ అయి ఉండండి.