TS Inter Supplementary Results 2025:
తెలంగాణా ఇంటర్మీడియట్ సప్లీమెంటరీ 2025 పరీక్షలను మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసింది. మొత్తం 4.12 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే పరీక్ష పత్రాలు మూల్యాంకనం ప్రారంభమై చాలా రోజులు కావొస్తోంది. అయితే ఇప్పుడు ఫలితాలు కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఫలితాలు రేపు లేదా ఎల్లుండి విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకునే విధంగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు సౌకర్యం కల్పిస్తున్నారు. ఫలితాలు ఎలా చూసుకోవాలనే సమాచారం ఇప్పుడు చూద్దాం.
సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యేది ఎప్పుడు?:
తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను జూన్ 9 లేదా 10వ తేదీన విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ తేదీలలో పరీక్ష ఫలితాలు విడుదల కానట్లయితే, జూన్ 15వ తేదీ నాటికి ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల తెలుసుకోవచ్చు.
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ డేట్
- ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో ” Telangana intermediate supplementary results 2025” ఆప్షన్ తో క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- వెంటనే స్క్రీన్ పైన రిజల్ట్స్ డౌన్లోడ్ అవుతాయి. అవి ప్రింట్ అవుట్ తీసుకోండి
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఉంటుందా?:
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్ పెట్టుకునే ఆప్షన్ కూడా బోర్డు వారు కల్పిస్తారు. దరఖాస్తు ఫీజు చెల్లించి వెబ్సైట్ ద్వారా గాని లేదా కళాశాల ద్వారా వెరిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
FAQ’s:
1. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2025 పరీక్ష ఫలితాలు విడుదల ఎప్పుడు?
జూన్ 9 లేదా 10వ తేదీన పరీక్ష ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
2. పరీక్ష ఫలితాలను ఏ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవాలి?.
https://tgbie.cgg.gov.in/ వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు.
