AP EAMCET 2025 Results:
జూన్ 14వ తేదీన విడుదల చేయాల్సిన ఏపీ ఎంసెట్ 2025 ఫైనల్ ఫలితాలను వారం రోజులు ముందుగానే, జూన్ 8వ తేదీ సాయంత్రం 5:30 నిమిషాలకు జెఎన్టియు VC. ప్రసాద్ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. 3.39 లక్షల మంది రాసిన ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్షలను మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహించారు. అయితే ఫలితాల్లో చాలామంది అభ్యర్థులకు మంచి ర్యాంకులు వచ్చాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగాల్లో టాప్ లో వచ్చినటువంటి ర్యాంకర్ల వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి. అలాగే మీకు వచ్చినటువంటి ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో కూడా ఇప్పుడే తెలుసుకోవచ్చు. ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసినాకూడా కౌన్సిలింగ్ తేదీలు మాత్రం ఇంకా విడుదల చేయలేదు.
AP EAMCET 2025 Top Rankers List:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగాల్లో టాప్ ర్యాంక్స్ తెచ్చుకున్న విద్యార్థులు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఇంజనీరింగ్ విభాగంలో టాప్ ర్యాంకర్స్ వీళ్ళే:
- 1st ర్యాంక్: హైదరాబాద్ కి చెందిన అనిరుద్ రెడ్డి కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది
- 2nd ర్యాంక్ : శ్రీకాళహస్తికి చెందిన చరణ్ రెడ్డికి రెండవ ర్యాంకు వచ్చింది
- 3rd ర్యాంక్ : పాలకొల్లుకు చెందిన యశ్వంత్ కు మూడవ ర్యాంకు వచ్చింది
- 4th ర్యాంక్: నంద్యాలకు చెందిన చరణ్ రెడ్డికి నాలుగో ర్యాంకు వచ్చింది
- 5th ర్యాంక్: అనంతపురానికి చెందిన నితిన్ కు ఐదవ ర్యాంకు వచ్చింది.
ఏపీ తెలంగాణ ఎంసెట్ 2025 బిటెక్ ఫస్టియర్ క్లాసెస్ ప్రారంభమయ్యే తేదీ:Official
అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగంలో టాప్ ర్యాంకర్స్ వీళ్ళే:
- 1st ర్యాంక్: పెనమలూరు కు చెందిన హర్షవర్ధన్ కు ఫస్ట్ ర్యాంకు వచ్చింది
- 2nd ర్యాంక్: హైదరాబాద్ కు చెందిన నిశాంత్ కు సెకండ్ ర్యాంక్ వచ్చింది
- 3rd ర్యాంక్: కోనసీమకు చెందిన వినయ్ కు 3rd ర్యాంకు వచ్చింది.
ఏపీ ఎంసెట్ ఫలితాలు ఎలా చూసుకోవాలి:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలను ఈ క్రింది విధానాన్ని ఫాలో అవ్వడం ద్వారా చెక్ చేసుకోవచ్చు.
- ముందుగా ఏపీ ఎంసెట్ అధికారికి వెబ్సైట్ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజీలో రిసల్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి.
- వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
- ర్యాంక్ కార్డ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.
AP EAMCET 2025 Rank vs College:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు మీకు వచ్చినటువంటి ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో అధికారిక కౌన్సిలింగ్ విడుదల కావడానికి ముందే మీరు తెలుసుకోవచ్చు. మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
AP EAMCET 2025: Rank vs College Predictor
అనుకున్న దాని కంటే ముందుగానే ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలను విడుదల చేశారు కాబట్టి త్వరగా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసి సర్టిఫికెట్ల పరిశీలన చేసి, విద్యార్థులకు సీట్ అలాట్మెంట్ చేసే అవకాశం ఉంది.
