AP EAMCET 2025 Results Released:
ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫైనల్ ఫలితాలను ఈరోజు అనగా జూన్ 8వ తేదీ సాయంత్రం 5:30 నిమిషాలకు ఏపీ ఎంసెట్ కన్వీనర్, JNTU VC ప్రసాద్ ఫలితాలను విడుదల చేయనున్నారు.3.39 లక్షల మంది విద్యార్థులు మే 19వ తేదీ నుండి మే 27వ తేదీ వరకు ఎంట్రన్స్ రాత పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష రాసిన విద్యార్థులు 2.64 లక్షల మంది కాగా, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ రాసిన విద్యార్థులు 75,460 మంది విద్యార్థులు ఉన్నారు. ఫలితాలను విద్యార్థులు వారి యొక్క మొబైల్ ఫోన్లో వాట్స్అప్ ద్వారా గాని లేదా అఫీషియల్ వెబ్సైట్లో కాని డౌన్లోడ్ చేసుకునే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల తేదీ మరియు సమయం:
ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలను జూన్ 8వ తేదీ సాయంత్రం 5:30 నిమిషాలకు జెఎన్టియు వీసీ ప్రసాద్ ఫలితాలు విడుదల చేయమన్నారు. ఫలితాలు విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP, TS ఎంసెట్ 2025 బిటెక్ మొదటి సంవత్సరం క్లాసెస్ ప్రారంభమయ్యే తేదీ

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:
ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు చూసుకోవడానికి క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో ” AP EAMCET results 2025 ” ఆప్షన్ ఎంచుకోండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్, రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన మీ యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది
- అది ప్రింట్ అవుట్ తీసుకోండి
ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు?:
ఫలితాలు ఇప్పుడే విడుదలైన అందిన ఎంసెట్ కౌన్సిలింగ్ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ కాలేదు. మరి కొద్ది రోజుల్లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసి సర్టిఫికెట్ల పరిశీలన చేసి, వెబ్ ఆప్షన్స్ ద్వారా విద్యార్థులకు సీట్ అల్లౌట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంత జరగడానికి మరొక రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
FAQ’s:
1. ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల చేసే సమయం?
జూన్ 8 సాయంత్రం 5:30 కు ఫలితాన్ని విడుదల చేయనున్నారు
2. నాకు ప్రాథమిక ఆన్సర్ కి చూసుకున్నాక 40 మార్కులు వచ్చాయి నేను అర్హత సాధిస్తానా?
కచ్చితంగా అర్హత సాధిస్తారు. మార్కులు కలుస్తాయి కాబట్టి మీకు ఏదో ఒక ర్యాంకు వస్తుంది.
3. ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి?
https://cets.apsche.ap.gov.in/EAPCET వెబ్సైట్లో మీ యొక్క వివరాలను సబ్మిట్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
