AP EAMCET 2025 Rank vs College:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలను ఈ రోజు అఫీషియల్ గా విడుదల చేశారు. ఫలితాలు చూస్తున్న విద్యార్థులు మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో ర్యాంకు ప్రెడిక్టర్ ద్వారా మీరు ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంది. ఇలా తెలుసుకోవడం ద్వారా మీకు వచ్చినటువంటి ర్యాంకు వల్ల ఏ కాలేజీలో సీటు వస్తుందో మీరు ముందుగానే మానసికంగా ప్రిపేర్ అయి ఉండవచ్చు. అలాగే దానికి తగ్గట్టుగా మీరు సర్టిఫికెట్స్ ని రెడీ చేసుకుని, కౌన్సిలింగ్ కి హాజరు కావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏపీ ఎంసెట్ పరీక్షలకు దాదాపుగా 3.39 లక్షల మంది రాశారు. వీరిలో చాలామందికి మంచి ర్యాంకులు వచ్చాయి, మరి కొంతమందికి చాలా ఎక్కువ ర్యాంకులు వచ్చాయి. అయినా కూడా మీకు వచ్చిన ర్యాంకుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కాలేజీలో సీటు వస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.
ఏపీ ఎంసెట్ పరీక్ష ఫలితాలు ఎప్పుడు విడుదల చేశారు?:
ఏపీ ఎంసెట్ 2025 పరీక్ష ఫలితాలను జూన్ 8వ తేదీ సాయంత్రం 5:30 నిమిషాలకు విడుదల చేయడం జరిగింది. పరీక్ష రాసిన విద్యార్థులు యొక్క మొబైల్ లోనే అధికారిక వెబ్సైట్ నుండి మీ ర్యాంక్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోండి. రాంగ్ కార్డు తో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్, ఫైనల్ ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకోండి.
AP ఎంసెట్ 2025 లో మీకు వచ్చిన ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో ఇప్పుడు తెలుసుకోండి:
Rank vs College వివరాలను తెలుసుకోవడానికి ఈ క్రింది స్టెప్స్ ని ఫాలో అవ్వండి.
ఏపీ ఎంసెట్ 20025 పరీక్షల ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి
- ముందుగా ఈ వెబ్సైట్ (Rank vs College) ఓపెన్ చేయండి.
- అక్కడ మీకు వచ్చిన ర్యాంక్ ఎంటర్ చేసి, జెండర్ సెలెక్ట్ చేసుకుని, క్యాటగిరి ఎంపిక చేసి, రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకుని “Predict Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- వెంటనే మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో తెలుస్తుంది.
AP EAMCET 2025 : Rank vs College Predictor
FAQ’s:
1. నాకు ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో చాలా ఎక్కువ ర్యాంకు వచ్చింది, ర్యాంక్ ని తగ్గించుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా?
జవాబు: ఒకసారి ఫైనల్ రిజల్ట్స్ విడుదలైన తర్వాత అందులో వచ్చిన ర్యాంక్, ఇక ఫైనల్ rank గా పరిగణించబడుతుంది. అందులో ఎటువంటి మార్పులు ఉండవు.
2.ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు?
జవాబు : ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి అధికారిక ప్రకారం ఇంకా వెలువడలేదు. అధికారిక ప్రకటన కోసం వెబ్సైట్ ని విజిట్ చేయండి.
