AP Inter supplementary results 2025:
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు మీ 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన ఏపీ ఇంటర్ మొదటి మరియు రెండో సంవత్సర సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈరోజు (జూన్ 7,2025) ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ఈ పరీక్షలకు లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఇప్పుడు ఫలితాలు ఏ విధంగా చూసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
how to check AP Inter results:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ క్రింది విధానం ద్వారా తెలుసుకోవచ్చు.
- ముందుగా APBIE వెబ్సైట్ https://resultsbie.ap.gov.in/ ఓపెన్ చేయాలి
- అందులో ” AP Inter advanced supplementary results 2025” ఆప్షన్ ఎంచుకోవాలి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి
- స్క్రీన్ పైన మార్క్స్ మెమో డౌన్లోడ్ అవుతుంది.
- ఫలితాల్లో మీ యొక్క పేరు సబ్జెక్టులు వారిగా మార్కులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది సరి చూసుకోవాలి
- మార్క్స్ మెమో ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
సప్లిమెంటరీ పరీక్ష ముఖ్యమైన తేదీలు:
- పరీక్షలు నిర్వహించిన తేదీలు : మే 12 నుండి మే 20 వరకు
- పరీక్షలు నిర్వహించిన వారు : ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్
- పరీక్షకు హాజరైన విద్యార్థులు : సుమారుగా 4 లక్షల మంది
- ఫలితాలు విడుదల చేసిన తేదీ : జూన్ 7, 2025
రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కు అవకాశం ఉంటుందా?:
ఏపీ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు రీకౌంటింగ్ లేదా రీవాల్యుయేషన్ విధానానికి అప్లై చేసుకోవచ్చు. అయితే కొంతమేరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఫలితాలు చూసుకునేందుకు అధికారిక వెబ్సైట్స్:
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు చూసుకునేందుకు ఇప్పుడు ఎందుకు వెబ్సైట్స్ ని ఓపెన్ చేయండి.
- https://resultsbie.ap.gov.in/
- https://bie.ap.gov.in
- https://results.apcfss.in
- https://examresults.ap.nic.in
- పైన తెలిపిన వెబ్సైటు ద్వారా ఫలితాలు వెంటనే ఓపెన్ కాకపోతే,SMS ఎస్ఎంఎస్ ద్వారా గాని లేదా వాట్సప్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు.
- మనబడి, Schools9, Freejobsintelugu వంటి వెబ్సైట్స్ లో కూడా మీ యొక్క ఫలితాలను చూసుకోవచ్చు.
వాట్సాప్ లో ఫలితాలు ఎలా చూడాలి?:
- ముందుగా ఏపీ మనమిత్ర వాట్సాప్ నంబర్ +91 95523 00009 ను మీ మొబైల్లో సేవ్ చేసుకొని, HI అని మెసేజ్ చేయండి.
- సేవలు ఎంచుకోండి అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి
- ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆప్షన్ లోనికి వెళ్ళండి
- ” AP Inter advantages supplementary results 2025 ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థులకు హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి అవి ప్రింట్ అవుట్ తీసుకోండి.
గమనిక:
మీరు ఫలితాలు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఫలితాలలో మీ పేరు, మార్కులు, సబ్జెక్టులు సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇది తప్పనిసరిగా చేయవలసిన పని. ఒరిజినల్ మార్క్స్ మెమోలు మీరు మీ కాలేజ్ ద్వారా తర్వాత పొందవచ్చు.
