తల్లికి వందనం పథకం ద్వారా ₹15,000 అకౌంట్ లో పడాలంటే జూన్ 12వ తేదీలోగా ఈ రెండు పనులు తప్పనిసరిగా చేయాలి: లేదంటే డబ్బులు జమ కావు – వెంటనే ఇవి చెయ్యండి

తల్లికి వందనం పథకం 2025 (Thalliki Vandanam Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న తల్లికి వందనం పథకం 2025 (Thalliki Vandanam Scheme 2025) కి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ తల్లికి వందనం పథకానికి అర్హులైనటువంటి పాఠశాలలకు వెళ్ళేటటువంటి పిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో వారు జూన్ 12వ తేదీలోగా రెండు ముఖ్యమైన సెటప్స్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఖాతాలో డబ్బులు జమకావు. డబ్బులు ఎటువంటి సమస్య లేకుండా జమ కావాలి అంటే మీరు చేయవలసిన రెండు ముఖ్యమైన పనుల గురించి ఈ పూర్తి ఆర్టికల్ చదివి తెలుసుకుందాం.

తల్లికి వందనం పథకం ఎవరికోసం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటవ తరగతి నుండి 12వ తరగతి వరకు స్కూల్స్ మరియు కళాశాలలకు హాజరయ్యే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లుల అకౌంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంత మంది పిల్లలకు, ప్రతి పిల్లవాడికి ₹15,000/- చొప్పున తల్లి యొక్క అకౌంట్లో డబ్బులు జమ చేసే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఈ పథకాన్ని జూన్ 12వ తేదీ మొదటిసారిగా ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఆర్థిక సహాయం చేయడం వల్ల పిల్లలు చక్కటి విద్యను అభ్యసించడానికి, వారి చదువులకు అయ్యేటువంటి ఖర్చులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అని ప్రభుత్వం భావిస్తోంది.

Join What’s App Group

చేయవలసిన రెండు ముఖ్యమైన పనుల:

  1. అర్హులైన తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాను ఆధార్ తో లింక్ చేయాలి.
  2. ఆ ఖాతాను NPCI (National Payments Corporation of India) మ్యాప్ చేయాలి.

ఈ రెండు లింకింగ్లు జూన్ 12వ తేదీలోగా పూర్తి చేసినట్లయితే, తల్లుల యొక్క ఖాతాలో డబ్బులు ఎటువంటి సమస్య లేకుండా జమ కావడం జరుగుతుంది.

ఏపీలో తల్లికి వందనం పథకంలాగానే మహిళలకు మరొక పథకం: ₹15,000/- జమ

జూన్ 12వ తేదీ లోపు ఈ లింకింగ్ పూర్తి కాకపోతే, తల్లికి వందనం పథకం కింద వచ్చే 15 వేల రూపాయలు నిధులు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ డబ్బులు పరుగులైన తల్లులు ఎకౌంట్లో జమ అయ్యే అవకాశం తగ్గిపోతుందని అధికారులు స్పష్టం చేశారు.

తల్లికి వందనం పథకం ప్రారంభ తేదీ :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి తల్లి అకౌంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు ప్రతి పిల్లవాడికి 15 వేల రూపాయల చొప్పున అకౌంట్లో డబ్బులు జమ చేయమన్నారు. దీని ద్వారా తల్లికి పిల్లలు చదువులు చదివించడానికి కావలసిన ఆర్థిక స్తోమత లభిస్తుంది అని ప్రభుత్వం అంచనా.

లింకింగ్ ఎలా చెక్ చేయాలి?:

  • మీరు ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ యొక్క బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి
  • లేదంటే మీ దగ్గరలోని గ్రామా లేదా వార్డు సచివాలయంలో లేదా మీసేవ కేంద్రంలో కూడా NPCI లింకింగ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
  • అధికారిక వెబ్సైట్ : https://www.npci.org.in

NPCI లింక్ స్టేటస్ ఎలా చూసుకోవాలి?

  • మీ బ్యాంకు ఖాతా ఆధార్ తో NPCI లో మ్యాప్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి మీరు మీ బ్యాంకుకు వెళ్ళవచ్చు, లేదా సచివాలయం ద్వారా చెక్ చేసుకోవచ్చు. దీనితోపాటు అదనంగా కొన్ని రాష్ట్రాల్లో NPCI లింకు చెకింగ్ మేళాలు కూడా నిర్వహిస్తున్నారు.

తల్లికి వందనం పథకం వివరాల:

  1. ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లికి ₹15,000/- ప్రభుత్వం మంజూరు చేస్తుంది.
  2. విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో 75% హాజరు కలిగి ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది
  3. ప్రతి విద్యార్థికి ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ నిధులు జమవుతాయి

తల్లికి వందనం పథకం తాజా అప్డేట్ :

ఏడాది జూన్ 12వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తల్లుల అకౌంట్లో ₹15000/- జమ చేసే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించనుంది. అందుకే ముందస్తుగా ఈ రెండు పనులు తప్పనిసరిగా చేసుకోవాలని సూచించింది.

ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, బంధువులు కామా ఇతరులకు తెలిసే విధంగా షేర్ చేయండి. సచివాలయంలో మరియు బ్యాంకులో రద్దీ ఉంటుంది కావున వెంటనే వెళ్లి స్టేటస్ చెక్ చేసుకోండి. అర్హులైన వారందరికీ తప్పకుండా డబ్బులు వచ్చే విధంగా చర్యలు తీసుకోండి.