RRB NTPC Graduate Exam 2025:
RRB NTPC 2025 గ్రాడ్యుయేట్ CBT 1 రాత పరీక్షల అడ్మిట్ కార్డులను జూన్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. అడ్మిట్ కార్డ్స్ లేదా హాల్ టికెట్స్ సంబంధిత ఆర్ఆర్బీ వెబ్సైట్స్ లో అందుబాటులో ఉంచనున్నారు.
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ విధానం:
- మీరు దరఖాస్తు చేసుకున్న ప్రాంతీయ రీజినల్ RRB వెబ్సైట్ని సందర్శించండి (RRB NTPC 2025 Admit Card)
- “CEN No. 05/2024” లింక్ పై Click చెయ్యండి.
- “RRB NTPC 2025 Admit Card” లింకును ఎంచుకోండి
- మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ ని నమోదు చేయండి
- అడ్మిట్ కార్డు ని డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
దరఖాస్తుదారుల సంఖ్య మరియు పోస్టుల వివరాలు:
✅ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎన్టీపీసీ పరీక్షలకు మొత్తం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య :12,167,679 (1.21 కోట్లు)
- గ్రాడ్యుయేట్స్ స్థాయి పోస్టుల దరఖాస్తుల సంఖ్య: 5,840,861
- అండర్ గ్రాడ్యుయేట్స్ స్థాయి పోస్టుల దరఖాస్తుల సంఖ్య: 6,326,818
- మొత్తం ఖాళీలు: 11,558
- గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు: 8,113
- అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు: 3,445
పరీక్ష విధానం:
రైల్వే ఆర్ఆర్బి ఎన్టిపిసి పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తారు.
RTC లో కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాలు: 10th అర్హత
- CBT 1 ప్రశ్నలు: 100 మార్కులు
- పరీక్ష వ్యవధి: 90 నిముషాలు
- నెగటివ్ మార్కింగ్: తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులు తగ్గింపు.
- CBT 2 రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా మెరిట్ మార్కులు వచ్చిన వారికి ఈ రైల్వే ఉద్యోగాలు ఇస్తారు.
ఏ టాపిక్ నుండి ఎన్ని ప్రశ్నలు వస్తాయి?:
రైల్వే ఎన్ టి పి సి గ్రాడ్యుయేట్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలో నీ క్రింది టాపిక్స్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి అనేది తెలుసుకోండి.
- మ్యాథమెటిక్స్ లేదా ఆటిట్యూడ్ : 30 ప్రశ్నలు -30 మార్కులు
- జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ : 30 ప్రశ్నలు -30 మార్కులు
- జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ సైన్స్ : 40 ప్రశ్నలు- 40 మార్కులు
CBT 1 రాత పరీక్షలో అర్హత పొందిన వారికిCBT 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి మెడికల్ టెస్ట్. ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు
ముఖ్యమైన వెబ్సైటు లింక్స్:
మీ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది వెబ్ సైట్ లింక్స్ ద్వారా మీరు ఏ రీజియన్లకి అప్లై చేసుకున్నారో, సంబంధిత వెబ్సైట్స్ ని ఓపెన్ చేసి అడ్మిట్ కార్డ్స్ ని డౌన్లోడ్ చేసుకోండి.
RRB NTPC 2025 Admit Cards Download Link
మీరు ఎంచుకున్న పరీక్ష సెంటర్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చిందా లేదా అనేది క్రింది కామెంట్ సెక్షన్ లో తెలపండి.
