Andhra Pradesh Deepam 2 Phase 2 Bookings:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ ఇచ్చే దీపం 2 రెండో విడత బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం 2024 అక్టోబర్ నెలలో మొదటి విడత గ్యాస్ బుకింగ్స్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మహిళలు వారి పేరు మీద మొదటి విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారు. ఈ దీపం 2 పథకం ద్వారా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఇప్పుడు మొదటి విడత గ్యాస్ సిలిండర్స్ పూర్తయ్యాయి రెండో విడత గ్యాస్ సిలిండర్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుండి జూలై 1వ తేదీ వరకు రెండో విడత గ్యాస్ సిలిండర్స్ ని బుక్ చేసుకోవచ్చు.
దీపం 2 రెండో విడత గ్యాస్ సిలిండర్ బుకింగ్ వివరాలు:
- బుకింగ్ ప్రారంభ తేదీ: ఏప్రిల్ 1st, 2025
- బుకింగ్ ముగింపు తేదీ : జూలై 1st, 2025
- లబ్ధిదారులు ఎవరు?: 2024 లో మొదటగా దీపం 2 పథకం కింద గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారు అర్హులు.
- బుకింగ్ డెలివరీ ఎన్ని రోజుల్లో వస్తుంది?: బుక్ చేసుకున్న 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తారు.
- గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రీఫండ్ ఎన్ని రోజులకి?: సిలిండర్ కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లోపు డబ్బులు జమ అవుతాయి.
అర్హతలు:
దీపం 2 పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్ ని పొందాలంటే ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
ఏపీలో తల్లికి వందనం పథకం ప్రారంభ తేదీ వచ్చేసింది: Apply now
- ఆంధ్రప్రదేశ్కు చెందిన శాశ్వత నివాసి అయి ఉండాలి
- తెల్ల రేషన్ కార్డు ఉండాలి
- దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబమై ఉండాలి
- మహిళకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- కుటుంబంలో ఎవరికి ఇంతకుముందు గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు
కావలసిన డాక్యుమెంట్స్:
దీపం 2 గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం ఈ క్రింది సర్టిఫికెట్స్ తప్పనిసరిగా ఉండాలి.
- తెల్ల రేషన్ కార్డ్
- ఆధార్ కార్డ్
- ఆదాయ ధ్రువీకరణ పత్రం – మండల రెవెన్యూ అధికారుల నుంచి పొందినది ఉండాలి.
- నివాస ధ్రువీకరణ పత్రం
- బ్యాంకు ఖాతా వివరాలు
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
- ముఖ్యమైన గమనిక: ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఆలయ ధ్రువీకరణ పత్రం నివాస ధ్రువీకరణ పత్రం బ్యాంకు ఖాతా వివరాలు ఇవన్నీ కూడా ఒకే వ్యక్తి పేరుతో ఉండాలి. బ్యాంకు ఖాతా ఆధార్ లింక్ అయి ఉండాలి
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:
దీపం 2 పథకం కోసం ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకోండి.
- లబ్ధిదారుని యొక్క సొంత గ్రామం లోని గ్రామ సచివాలయం నుండి దరఖాస్తు ఫారం పొందాలి
- దరఖాస్తు గాడు ఆ ఫామ్ అంతా పూర్తిగా ఫిలప్ చేసి, ఇతర సర్టిఫికెట్స్ అన్నీ కూడా కలిపి దగ్గరలోని సచివాలయంలో గాని లేదా ఇతర ప్రభుత్వ సంస్థల్లో గాని సబ్మిట్ చేయాలి.
- ముఖ్యమైన గమనిక:eKYC ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి చేయాలి. గ్యాస్ సిలిండర్ సప్లై చేసే గ్యాస్ డెలివరీ బాయ్స్ ద్వారా ఇంటి వద్దనే చేయించుకోవచ్చు.
హెల్ప్ లైన్ నంబర్స్:
దీపం టు పథకం సందేహాలు, సలహాల కోసం ఈ క్రింది టోల్ ఫ్రీ నెంబర్స్ ని సంప్రదించండి.
- పౌరసరఫరాల శాఖ : 1967
- ఆయిల్ కంపెనీ కాల్ నెంబర్(1800 233 3555)
పైన తెలిపిన విధంగా ఆంధ్రప్రదేశ్ లోని మహిళలు దీపం 2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను పొందవచ్చు. పథకానికి ఉండవలసిన అర్హతలు అలాగే ఇతర అవసరమైనటువంటి సర్టిఫికెట్స్ అన్ని కలిపి ఈ దీపం 2 పథకానికి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
