AP EAMCET 2025:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ రాత పరీక్ష రాసిన విద్యార్థుల్లో ఏపీ ఇంటర్ బోర్డు కాకుండా ఇతర బోర్డులు అనగా CBSE, ICSE, డిప్లొమా,Aposs, NIOS, ఇతర బోర్డులో 10+2 చదివిన విద్యార్థులు వారి యొక్క మార్కులను ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ వెబ్సైట్లోని డిక్లరేషన్ ఫామ్ లో మార్కులను వెంటనే మే 30వ తేదీలోగా అప్లోడ్ చేయాలి. ఇతర బోర్డులకు సంబంధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులు వారి యొక్క మార్కులను అప్లోడ్ చేయనట్లయితే, ర్యాంక్ అలాట్మెంట్ సమయంలో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కావున మీకు ర్యాంకు రావాలి అంటే కచ్చితంగా మీ యొక్క మార్కులను మే 31వ తేదీలోగా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలని ఏపీ ఉన్నత విద్యా మండలి డిపార్ట్మెంట్ వారు తెలిపారు. అయితే ఈ మార్కులను ఎలా అప్లోడ్ చేయాలనేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకోండి.
ఇంటర్ మార్కులను ఎవరు అప్లోడ్ చేయాలి?:
ఈ క్రింది తెలిపినటువంటి బోర్డుల విద్యార్థులు ఇంటర్ మార్కులను తప్పనిసరిగా మే 30వ తేదీలోగా అప్లోడ్ చేయాలి.
- CBSE బోర్డు విద్యార్థులు
- ICSE బోర్డు విద్యార్థులు
- Aposs విద్యార్థులు
- NIOS, డిప్లొమా విద్యార్థులు అప్లోడ్ చేయాలి.
ఎలా అప్లోడ్ చేయాలి?:
- ముందుగా ఏపీ ఎంసెట్ 2025 వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET ఓపెన్ చేసి
- వెబ్సైట్ హోమ్ పేజీలోనే డిక్లరేషన్ ఫామ్ అని ఆప్షన్ పై క్లిక్ చేయండి
- అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
- మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది అందులో మీ యొక్క ఇంటర్మీడియట్ మార్కులను ఎంటర్ చేసి వెంటనే అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి.
కావలసిన సర్టిఫికెట్స్ వివరాలు:
ఏపీ ఎంసెట్ 2025 లో మీకు 40 మార్కులు వచ్చినవారికి మార్కులు కలుస్తాయి రెండు విధాలుగా : Click Here
- పదవ తరగతి మార్క్స్ మెమో
- CBSE/ICSE/డిప్లొమా /Aposs /NIOS ఫైనల్ మార్క్ షీట్ పిడిఎఫ్ లేదా jpg ఫైల్స్ ని అప్లోడ్ చేయాలి
- ఏపీ ఎంసెట్ 2025 హాల్ టికెట్ నెంబర్ ఉండాలి
AP EAMCET 2025: Official Website
ఎందుకు అప్లోడ్ చేయాలి?:
ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కాకుండా ఇతర బోర్డులలో చదివినటువంటి ఇంటర్ అభ్యర్థులు వారి యొక్క మార్కులను అప్లోడ్ చేయనట్లయితే కౌన్సిలింగ్ సమయంలో మరియు సర్టిఫికెట్స్ పర్సనల్ సమయంలోనే కాకుండా ర్యాంకులను కేటాయించే సమయంలోనూ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల వేరే బోర్డులో చదివినటువంటి విద్యార్థులకు ర్యాంకును కేటాయించే అవకాశం కూడా ఉండదు కావున మీరు ర్యాంకును కోల్పోయే అవకాశం ఉంటుంది.
ఏపీ ఎంసెట్ 20025 ర్యాంకు పొందాలి అంటే ఎటువంటి సాంకేతిక సమస్యలు రాకుండా ఉండాలి అంటే కచ్చితంగా మీరు ఇతర బోర్డులో ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు మీ యొక్క మార్కులను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి.
FAQ’s:
1. నేను CBSE 12th చదివాను ఇప్పుడు డిక్లరేషన్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలా ?
అవును. ఏపీ ఇంటర్ బోర్డు కాకుండా ఇతర బోర్డులలో ఇంటర్ పాస్ అయినటువంటి వారు ఏపీ ఎంసెట్ పరీక్ష రాసినట్లయితే కచ్చితంగా మే 30వ తేదీలోగా మార్పులను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
2. డిక్లరేషన్ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది?
ఏపీ ఎంసెట్ 20025 వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET లో డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది అది క్లిక్ చేసి ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి.
3. డాక్యుమెంట్లను ఏ ఫార్మేట్ లో అప్లోడ్ చేయాలి?
ఇంటర్ మార్క్స్ మెమోవాలకు సంబంధించిన డాక్యుమెంట్లను పిడిఎఫ్ లేదా jpg ఫార్మేట్ లో అప్లోడ్ చేయండి